వాహన ప్రియులకు గుడ్‌న్యూస్‌..! ఆ మోడల్స్‌ కార్లపై హ్యుందాయ్‌, మారుతీ భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌..!

వాహన ప్రియులకు గుడ్‌న్యూస్‌..! ఆ మోడల్స్‌ కార్లపై హ్యుందాయ్‌, మారుతీ భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌..!

విధాత‌: దేశంలో పండుగ సీజన్ మొదలైంది. చాలా మంది పండుగల సీజన్‌లో వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో ఆటోమొబైల్‌ కంపెనీలు ఆయా వాహనాలపై భారీగా డిస్కౌంట్‌ ఆఫర్‌ను ప్రకటిస్తున్నాయి. హ్యుందాయ్‌తో పాటు మారుతీ సుజుకీ కంపెనీ పలు మోడల్స్‌పై బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించాయి.


హ్యుందాయ్​ ఆరా సీఎన్​జీ వెర్షన్‌పై హ్యుందాయ్‌ రూ.33వేల వరకు డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తుండగా ఇందులో రూ.20వేలు క్యాష్‌ డిస్కౌంట్‌ కాగా.. మరో రూ.10వేలు ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ కాగా.. రూ.3వేలు కార్పొరేట్‌ డిస్కౌంట్‌ ఇస్తున్నది.


అలాగే కాంపాక్ట్‌ సెడాన్‌కు చెందిన పెట్రోల్‌ వెర్షన్‌పై రూ.10వేల వరకు క్యాష్‌ బోనస్‌, రూ.10వేల వరకు ఎక్స్ఛేంజ్‌ బోనస్‌, రూ.3వేల వరకు కార్పొరేట్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తున్నది. ఇదిలా ఉండగా.. ఇటీవల హ్యుందాయ్‌ ఆరా కారు ధర రూ.12వేల వరకు పెరిగింది. అయితే, పెరిగిన దానికన్నా ఎక్కువగానే డిస్కౌంట్‌ ఇస్తుండడం విశేషం.


మారుతీ సుజుకీ..


దేశీయ దిగ్గజ ఆటోమొబైల్‌ కంపెనీ మారుతి పండుగ సీజన్‌ నేపథ్యంలో నెక్సా, ఎరోనా మోడల్స్‌పై మంచి డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తున్నది. ముఖ్యంగా సెలేరియోపై క్రేజీ డీల్స్‌ అందుబాటులో ఉన్నాయి. సెలేరియో వీఎక్స్​ఐ, జెడ్​ఎక్స్​ఐ, జెడ్​ఎక్స్​ఐ పెట్రోల్​ ఎంటీపై రూ.35వేల వరకు క్యాష్​ డిస్కౌంట్​, రూ.20వేల వరకు ఎక్స్ఛేంజ్‌ బోనస్‌, రూ.4వేల వరకు కార్పొరేట్‌ డిస్కౌంట్‌ ఇస్తున్నది.


సెలేరియో ఏఎంటీ వెర్షన్‌పై రూ.30వేల వరకు క్యాష్​ డిస్కౌంట్, రూ.20వేల విలువైన ఎక్స్ఛేంజ్‌ బోనస్‌, రూ.4వేల విలువైన కార్పొరేట్‌ డిస్కౌంట్‌ ఇస్తున్నది. సీఎన్​జీ వేరియంట్​పైనా తగ్గింపు వర్తించనున్నది. ఈ మోడల్​పై రూ.30వేల క్యాష్​ డిస్కౌంట్​, రూ.20వేల ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ ఇస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.