Wild Boar Attack : ఫారెస్టు ఆఫీసర్ పై అడవి పంది దాడి..వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లోని బదాయూన్‌లో అడవి పంది బీభత్సం సృష్టించింది. రెస్క్యూ ఆపరేషన్‌లో ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్ శివమ్ ప్రతాప్ సింగ్‌పై దాడి చేసి, రెండు నిమిషాల పాటు కిందపడేసి తొక్కిపట్టింది.

Wild Boar Attack : ఫారెస్టు ఆఫీసర్ పై అడవి పంది దాడి..వీడియో వైరల్

విధాత : ఫారెస్టు అధికారిపై అడవి పంది దాడి వీడియో వైరల్ గా మారింది. వీడియోలో అడవి పంది దాడి ఎంత బీభత్సంగా ఉంటుందో చూసిన వారు వామ్మో పంది అనుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బదాయూన్‌లో ఉఝాని పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్సౌలీ గ్రామంలో ఒక అటవీ అధికారిపై అడవి పంది దాడి చేసిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. పంటలను నాశనం చేస్తున్నఅడవి పందిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఫారెస్టు అధికారి శుభం ప్రతాప్ సింగ్ తన బృందంతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ కోసం అక్కడికి చేరుకున్నారు.

వల సహాయంతో పందిని చుట్టుముట్టడానికి ప్రయత్నిస్తుండగా, ఆ జంతువు అకస్మాత్తుగా దాడి చేసింది. అది దాదాపు రెండు నిమిషాల పాటు అధికారిని కింద పడేసి నోట కరిచుకుని నొక్కి పట్టింది. సంఘటనా స్థలంలో ఉన్న ఇతర సిబ్బంది కర్రలతో పందిని తరిమివేసి, గాయపడిన అధికారిని రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి :

Vaibhav Suryavanshi : క్రికెట్ వండర్.. వైభవ్ సూర్యవంశీకి బాల పురస్కార్
New Year Celebrations : న్యూ ఇయర్ పార్టీలా…ఈగల్ చూస్తుంది జాగ్రత!