పెద్దపులి దాడిలో..నలుగురు మహిళల మృతి

మహారాష్ట్రలోని గుంజవాహి అటవీ ప్రాంతంలో పులి దాడి చేసి నలుగురు మహిళలను చంపింది. తునికాకు సేకరించేందుకు వెళ్లిన మరో 9 మంది మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.

మహారాష్ట్రలోని గుంజవాహి అటవీప్రాంతంలో పులి దాడి చేసిన ఘటనలో నలుగురు మహిళలు మృతి చెందారు. తునికాకు సేకరించేందుకు అడవిలోకి వెళ్లిన మహిళలపై దాడి పెద్దపులి దాడి చేసింది. ఈ దాడిలో నలుగురు మహిళలు మృతి చెందడం విషాదం రేపింది.

చంద్రపూర్ జిల్లాలో సిందేవాహి తాలూకాలోని అటవీ ప్రాంతంలో తునికాకు(బీడి ఆకు) సేకరణకు 13మంది మహిళలు వెళ్లారు. వారిపై పులి దాడి చేసిన ఘటనలో నలుగురు మహిళలు చనిపోగా..మిగతా 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఏరియాలో పులి సంచారం ఎక్కువగా ఉంటుందని, ఈ రోజు ఉదయం ఈ ఘటన జరిగిందని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

రాజ్యసభలో బీజేపీకి మ్యాజిక్ ఫిగర్?
‘కాక్రోచ్ జనతా పార్టీ’తెలంగాణ సీఎం నేనే !

Latest News