Road accident | ఎదురెదురుగా ఢీకొన్న కారు, బొలెరో.. నలుగురు యూట్యూబర్‌లు దుర్మరణం..
Road accident | రోడ్డు ప్రమాదంలో నలుగురు యూట్యూబర్‌లు దుర్మరణం పాలయ్యారు. ఎదురెదురుగా వచ్చిన కారు, బొలెరో పరస్పరం ఢీకొనడంతో కారులో ఉన్న నలుగురు యూట్యూబర్‌లు అక్కడికక్కడే మరణించారు. రెండు వాహనాల్లో కలిపి మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Road accident : రోడ్డు ప్రమాదంలో నలుగురు యూట్యూబర్‌లు దుర్మరణం పాలయ్యారు. ఎదురెదురుగా వచ్చిన కారు, బొలెరో పరస్పరం ఢీకొనడంతో కారులో ఉన్న నలుగురు యూట్యూబర్‌లు అక్కడికక్కడే మరణించారు. రెండు వాహనాల్లో కలిపి మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
అమ్రోహా జిల్లాలోని హసన్‌పూర్ గజ్రౌలా రోడ్డుపై ప్రమాదం జరిగింది. గాయపడిన వారికి చికిత్స అందించేందుకు పోలీసులు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ప్రమాదానికి గురైన యూట్యూబర్‌లు గత కొన్నాళ్లుగా ‘రౌండ్ టు వరల్డ్’ పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్నారు.
ఈ క్రమంలో వారంతా అమ్రోహా జిల్లాలోని హసన్‌పూర్లో ఓ బర్త్‌డే పార్టీకి హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. హసన్‌పూర్-గజ్రౌలా రోడ్డులోని మనోటా బ్రిడ్జి సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారు, ఎదురుగా వచ్చిన బొలెరో ఢీకొన్నాయి. మృతులు లక్కీ, సల్మాన్, షారుక్, షానవాజ్‌గా పోలీసులు గుర్తించారు. వీరంతా కామెడీ వీడియోలు చేస్తుంటారని తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram