Duvvada Madhuri Srinivas | మ‌రో వివాదంలో ఇరుక్కున్న దివ్వెల మాధురి- దువ్వాడ శ్రీనివాస్‌.. పోలీసుల అదుపులో ఉన్నారా?

Duvvada Madhuri Srinivas | వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శాసన మండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య, బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా గుర్తింపు పొందిన దివ్వెల మాధురి మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహించినందుకు హైదరాబాద్ ఎస్ఓటీ అధికారులు ఈ జంటను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

  • By: sn |    movies |    Published on : Dec 12, 2025 9:46 AM IST
Duvvada Madhuri Srinivas | మ‌రో వివాదంలో ఇరుక్కున్న దివ్వెల మాధురి- దువ్వాడ శ్రీనివాస్‌.. పోలీసుల అదుపులో ఉన్నారా?

Duvvada Madhuri Srinivas | వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శాసన మండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య, బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా గుర్తింపు పొందిన దివ్వెల మాధురి మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహించినందుకు హైదరాబాద్ ఎస్ఓటీ అధికారులు ఈ జంటను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దివ్వెల మాధురి పుట్టినరోజు సందర్భంగా మొయినాబాద్ సమీపంలోని ‘ది పెండెంట్’ ఫామ్ హౌస్‌లో ఈ భారీ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. అయితే ముందస్తు అనుమతి లేకుండా జోరుగా మద్యం విందు, డీజే సౌండ్స్‌తో పార్టీ నిర్వహించడం స్థానికులకు అనుమానం కలిగించింది.

అలా బుక్ అయింది..

ఈ విషయం పోలీసులకు తెలియడంతో రాజేంద్రనగర్ పోలీసులు–ఎస్ఓటీ సంయుక్తంగా ఫామ్ హౌస్‌పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ మొత్తంలో విదేశీ మద్యం బాటిళ్లు, హుక్కా పరికరాలు స్వాధీనం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఫంక్షన్ నిర్వహణకు సంబంధించిన ఎలాంటి అనుమతులు లేకుండా భారీ స్థాయిలో పార్టీ నిర్వహించడమే కాక, మద్యం నిల్వ నిబంధనలను కూడా ఉల్లంఘించిన నేపథ్యంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పుతున్నారు. దీనిపై మాధురి కాని శ్రీనివాస్ కాని ఏం స్పందిస్తారా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఇటీవల బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవిక్ట్ అయిన దివ్వెల మాధురి, తన పుట్టినరోజు వేడుక కారణంగా మరోసారి వార్తల్లో నిలవడం ప్రత్యేకంగా మారింది. దాడుల అనంతరం పార్టీ పూర్తిగా భగ్నం కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. కాగా, మాధురి వైల్డ్ కార్డ్‌గా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టింది. హౌజ్‌లోకి వెళ్లినప్ప‌టి నుండి కాస్త పెత్త‌నం చ‌లాయించాల‌ని చూసింది. అయితే మాధ‌రి ప్ర‌వ‌ర్త‌న‌తో విసిగిపోయిన ప్రేక్ష‌కులు ఆమెని త్వ‌ర‌గానే ఇంటి నుండి బ‌య‌ట‌కు పంపారు.