Paris Olympics | పారిస్ ఒలింపిక్స్‌ ప్రారంభం నుంచి ముగింపు వరకు

గత 19 రోజులుగా పారిస్‌ వేదికగా ఒలింపిక్స్‌ క్రీడలు వైభవంగా సాగుతున్నాయి. నేటితో ఈ మెగా ఈవెంట్‌ ముగియనున్నది. మన దేశ కాలమానం ప్రకారం రాత్రి 12 గంటలకు ముగింపు వేడకలు జరగనున్నాయి. గత ఏడాది ఏడు పతకాలు గెలచుకున్న మన దేశం ఈసారి ఆరు పతకాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్‌ ప్రారంభం నుంచి ముగింపు వరకు

గత 19 రోజులుగా పారిస్‌ వేదికగా ఒలింపిక్స్‌ క్రీడలు వైభవంగా సాగుతున్నాయి. నేటితో ఈ మెగా ఈవెంట్‌ ముగియనున్నది. మన దేశ కాలమానం ప్రకారం రాత్రి 12 గంటలకు ముగింపు వేడకలు జరగనున్నాయి. గత ఏడాది ఏడు పతకాలు గెలచుకున్న మన దేశం ఈసారి ఆరు పతకాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఈసారి ఒలింపిక్స్‌ వేడుకలు సెన్‌ నదిలో ప్రారంభం వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఓపెనింగ్‌ నుంచి భారత రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ క్వార్టర్స్‌, సెమీస్‌ అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్‌లో భారత్‌కు మరో పతకం ఖాయనని అందరూ అనుకుంటుండగా.. అనూహ్యంగా నిర్ణీత బరువు కంటే 100 గ్రాములు అదనంగా ఉన్నదనే కారణంతో అనర్హత వేటుకు గురికావడం మన దేశ అభిమానులను నిరాశకు గురి చేసింది. లింగ వివాదంలో అల్జీరియా బాక్సర్‌ ఇమానె ఖెలిఫ్‌ ఆమె కాదంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. కేవలం 46 సెకన్లలోనే ప్రత్యర్థిని చిత్తు చేయడంలో ఈ వ్యాఖ్యలు ఎక్కువయ్యాయి. ఆస్ట్రేలియా స్కేట్‌బోర్డింగ్‌ సంచలన అథ్లెట్‌ ఆరిసా ట్రై రికార్డు సృష్టించింది. 14 ఏళ్ల వయసులోనే ఆమె దేశం తరఫున స్వర్ణ పతకం సాధించింది.
మరోవైపు క్యూబా రెజ్లర్‌ మిజైన్‌ లోపేజ్‌ చరిత్ర సృష్టించాడు. వ్యక్తిగత విభాగంలో వరుసగా ఐదు స్వర్ణ పతకాలను సాధించిన అథ్లెట్‌గా నిలిచాడు. ఈ ఒలింపిక్స్‌ తర్వాత వీడ్కోలు చెప్పేందుకు సిద్ధమని ప్రకటించాడు. టెన్సిస్‌ స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ గోల్డెన్‌ స్లామ్‌గా నిలిచాడు. ఒలింపిక్స్‌ సింగిల్స్‌ ఫైనల్‌ విభాగంలో కార్లోస్‌ అల్కరాజ్‌పై విజయం సాధించి స్వర్ణం సొంతం చేసుకున్నాడు.
ఇక టేబుల్‌ టెన్నిస్‌ ఈవెంట్‌లో దక్షిణ కొరియా కాంస్యం గెలుచుకోగా.. ఉత్తర కొరియ రజతం దక్కించుకున్నది. దీంతో ఒకే పోడియంపై ఇరు దేశాల అథ్లెట్లు సెల్ఫీ తీసుకున్నారు. ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ దేశాల క్రీడాకారులు క్రీడా స్ఫూర్తి ప్రదర్శించడం గమనార్హం.
సెకన్‌లో ఐదువేల వంతు తేడాతో నోవా లైల్స్‌ పరుగుల వీరుడుగా అవతరించాడు. 100 మీటర్ల ఫైనల్స్‌లో 9.79 సెకన్లతో స్వర్ణం గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా లైల్స్‌ మాట్లాడుతూ.. ‘అందరిలోకెల్లా నేనే ముందుంటా.. నేను తోడేళ్లకే తోడేలును’ అని వ్యాఖ్యానించాడు. జకోవిచ్‌ ఇప్పటికే ఫ్రెంచ్‌, వింబుల్డన్‌, ఆస్ట్రేలియన్‌, యూఎస్‌ ఓపెన్‌ టైటిళ్లను గెలుచుకున్నసంగతి తెలిసిందే. ఇప్పుడు స్వర్ణంతో అన్నింటిని సొంతం చేసుకున్న ఐదో టెన్నిస్‌ ప్లేయర్‌గా నిలిచాడు. ఈసారి ఒలింపిక్స్‌లో ఇవన్నీహైలెట్‌గా నిలిచాయి.