Vinesh Phogat | మళ్లీ రింగ్‌లోకి వినేశ్ ఫోగట్..! ఒలింపిక్స్‌లో భారత్‌కు మెడల్ తెస్తానని శపథం..!
Vinesh Phogat | మహిళా రెజ్లన్ వినేశ్ ఫోగట్ మళ్లీ రెజ్లింగ్ రింగ్‌లో కనిపించనున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన వినేశ్.. అధిక బరువు కారణంగా తృటిలో పతకం కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Vinesh Phogat | మహిళా రెజ్లన్ వినేశ్ ఫోగట్ మళ్లీ రెజ్లింగ్ రింగ్‌లో కనిపించనున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన వినేశ్.. అధిక బరువు కారణంగా తృటిలో పతకం కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రిటైర్‌మెంట్ నిర్ణయంపై వినేశ్ వెనక్కి తగ్గింది. భారత్‌కు ఒలింపిక్ పతకం అందిస్తానంటూ శపథం చేసింది. 2032 ఒలింపిక్స్ వరకు రెజ్లింగ్‌లో కొనసాగుతానని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో లేఖను విడుదల చేసింది.
లేఖ సారాంశం ప్రకారం.. ‘మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పతకం సాధించేందుకు ఎంతో కష్టపడ్డాను. ప్రత్యర్థులకు ఒక్క అవకాశం ఇవ్వలేదు.. లొంగిపోలేదు. కానీ, పరిస్థితులు మాత్రం కలిసిరాలేదు. విధి వంచించింది. అనూహ్య పరిణామాలతో ఒలింపిక్స్‌లో తిరుగుముఖం పట్టాను. 2032 వరకు పోరాగలనని అనుకుంటున్నాను. నాకు ఆ సత్తా ఉందనే నమ్మకం ఉన్నది. తాను నమ్ముకున్న దారి గురించి నిరంతరం పోరాడుతూనే ఉంటాననే ఖచ్చితంగా నమ్ముతున్నా’నంటూ పేర్కొంది. పారిస్ ఒలింపిక్స్‌లో వినేశ్ ఫోగట్ అద్భుతమైన ప్రదర్శన చేసి ఫైనల్‌కు చేరింది. వంద గ్రాములు అదనంగా బరువు ఉండడంతో అనర్హత వేటుపడింది. దీంతో తీవ్రమైన దిగ్భ్రాంతికి గురైన వినేశ్ రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్‌ను ప్రకటిస్తున్నట్లు ప్రకటించింది. తనదైన ప్రదర్శనతో కీలక మ్యాచుల్లోనూ విజయం సాధించి వినేశ్ ఫైనల్‌కు వెళ్లడంతో ఈ సారి రెజ్లింగ్‌లో గోల్డ్ మెడల్ ఖాయమని అనుకున్నారు. ఫైనల్‌లో ఓటమిపాలైన సిల్వర్ మెడల్ దక్కేది.
అనూహ్య పరిణామంతో అనూహ్యంగా బరువు పెరిగింది. బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన కలిసిరాలేదు. వినేశ్ 50 కిలోల విభాగంలో రెజ్లింగ్‌లో గంటల వ్యవధిలో జరిగిన ప్రి క్వార్టర్స్, క్వార్టర్స్, సెమీ ఫైనల్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసింది. తొలి బౌట్‌లో ప్రపంచ నెంబర్ వన్‌ను మట్టికరిపించింది. సెమీ ఫైనల్ వరకు అదే ప్రదర్శన కొనసాగించి.. వరుస విజయాలతో ఒలింపిక్స్ ఫైనల్‌లోకి వెళ్లిన భారత రెజ్లర్‌గా రికార్డులకెక్కింది. అనర్హత వేటు అనంతరం స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించగా.. అక్కడ నిరాశే ఎదురైంది. ఆర్బిట్రేషన్ నిర్ణయంపై స్విస్ కోర్టులో సవాల్ చేసేందుకు అవకాశం ఉన్నది.