గంభీర వంతెన కూలిన ప్రమాదంలో 18కి చేరిన మృతుల సంఖ్య

గంభీర వంతెన కూలిన ప్రమాదంలో 18కి చేరిన మృతుల సంఖ్య

విధాత, హైదరాబాద్ : గుజరాత్‌ రాష్ట్రంలోని మహిసాగర్ నదిపై గంభీర వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య 18కి పెరిగింది. వడోదర- ఆనంద్ జిల్లాలను కలిపే ప్రధాన వంతెనగా ఉన్న గంభీర వంతెన ఆకస్మాత్తుగా కూలిపోగా..ఆ సమయంలో వంతెన మీదుగా వెలుతున్న పలు వాహనాలు నదిలో పడిపోయాయి. సహాయక బృందాలు 14మందిని రక్షించాయి. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల నష్టపరిహారాన్ని ప్రకటించారు.