Golden Temple | 54 ఏండ్ల తర్వాత అంధకారంలో గోల్డెన్ టెంపుల్.. ఎందుకంటే..?
Golden Temple | పంజాబ్ రాష్ట్రం( Punjab State ) అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్( Golden Temple ).. 54 ఏండ్ల తర్వాత మరోసారి అంధకారంలో ఉండిపోయింది. గతంలో రెండుసార్లు మాత్రమే ఈ స్వర్ణ దేవాలయంలో లైట్లను ఆర్పేశారు.

Golden Temple | పంజాబ్ రాష్ట్రం( Punjab State ) అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్( Golden Temple ).. 54 ఏండ్ల తర్వాత మరోసారి అంధకారంలో ఉండిపోయింది. గతంలో రెండుసార్లు మాత్రమే ఈ స్వర్ణ దేవాలయంలో లైట్లను ఆర్పేశారు. తాజాగా గురువారం రాత్రి గోల్డెన్ టెంపుల్‌లో చీకట్లు అలుముకున్నాయి.
ఆపరేషన్ సిందూర్( Operation Sindoor ) తర్వాత భారత్ – పాకిస్తాన్( Pakistan ) మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూకశ్మీర్( Jammu Kashmir ), పంజాబ్, రాజస్థాన్( Rajasthan )లపైకి పాక్ యుద్ధ విమానాలు, క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లతో దాడులకు పాల్పడింది. దీంతో ఆ రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేసి బ్లాక్ అవుట్ పాటించారు. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో కూడా రాత్రి 10.30 నుంచి 11 గంటల వరకు బ్లాక్ అవుట్ పాటించారు.
ఈ సందర్భంగా శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ మాజీ సెక్రటరీ కుల్వంత్ సింగ్ మాట్లాడుతూ.. ఇలాంటి పరిస్థితి గతంలో రెండు సార్లు చోటు చేసుకుందని తెలిపారు. 1965, 1971లో ఇండో – పాక్ యుద్ధాల సందర్భంగా.. భద్రత కారణాల దృష్ట్యా స్వర్ణ దేవాలయంలో లైట్లు ఆర్పేసినట్లు గుర్తు చేశారు.