విధాత : ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితుల మధ్య భారత్‌కు చెందిన ‘గ్రీన్ ఆశా’ గ్యాస్ నౌక పశ్చిమాసియా నుంచి సురక్షితంగా నవీ ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ(JNPA) తీరానికి చేరుకుంది. నవీ ముంబైలోని నవశేవా పోర్టులో ఉన్న బీపీసీఎల్-ఐఓసీఎల్ (BPCL-IOCL) లిక్విడ్ బెర్త్ వద్ద ఈ నౌక విజయవంతంగా లంగరు వేసింది.
15,400 టన్నుల ఎల్పీజీతో (LPG)తో హోర్ముజ్ జలసంధిని దాటి వచ్చిన తొలి నౌకగా ఇది రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో యుద్ధ పరిస్థితుల మధ్య నౌకల రాకపోకలకు అంతరాయం నెలకొన్న నేపథ్యంలో భారత నౌక క్షేమంగా రావడం విశేషం. నౌక సిబ్బంది, కార్గో అంతా క్షేమంగా భారత్ చేరుకున్నారని అధికారులు తెలిపారు. యుద్దం ప్రారంభమైన తర్వాత హర్మూజ్ జలసంధిని దాటిన ఎనిమిదో భారత నౌకగా ‘గ్రీన్ ఆశా’ నిలిచింది. క్లిష్టమైన భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లోనూ దేశానికి అవసరమైన నిత్యావసర ఇంధన సరఫరాను అంతరాయం లేకుండా కొనసాగించే భారత సముద్ర రవాణా సామర్థ్యానికి ఇది నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నౌక రాకతో దేశీయ ఎల్‌పీజీ సరఫరా వ్యవస్థకు మరింత భరోసా లభించినట్లయ్యిందన్నారు.
🚨 Just IN 🚨
LPG tanker ‘Green Asha’ arrives in Mumbai carrying 15,000 tonnes of LPG. pic.twitter.com/WF8S1xKRxn
— Megh Updates 🚨™ (@MeghUpdates) April 9, 2026
ఇవి కూడా చదవండి :
ఎమ్మెల్యే పల్లాకు సైబర్ నేరగాళ్ల టొకరా..!
ఉద్యోగులు, విద్యార్థుల ఉసురు పోసుకుంటున్న సర్కార్.. రేవంత్ పాలనపై రగులుతున్న జనం
