Gurugram Corporate Employee | నెల ఖ‌ర్చు రూ.2.44 ల‌క్ష‌లా..? ఈ టెకీ బ‌డ్జెట్ చూసి షాక‌వుతున్న నెటిజ‌న్లు

గురుగ్రామ్‌కు చెందిన ఓ టెకీ (Gurugram Man) నెలవారీ ఖర్చుల (monthly expenditure) వివరాలు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. 31 ఏళ్ల‌ గగన్ సైనీ (Gagan Saini) కార్పొరేట్ సంస్థ‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అత‌డు త‌న‌ నెల‌వారీ మొత్తం ఖర్చు రూ.2,44,000గా పేర్కొన్నాడు.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Feb 23, 2026, 12:29 pm IST
Read Time: 5 mins
Gurugram Corporate Employee | నెల ఖ‌ర్చు రూ.2.44 ల‌క్ష‌లా..? ఈ టెకీ బ‌డ్జెట్ చూసి షాక‌వుతున్న నెటిజ‌న్లు

Gurugram Corporate Employee | ప్ర‌స్తుతం చిన్న‌చిన్న న‌గ‌రాల్లో సైతం కాప్టాఫ్ లివింగ్ (Cost Of Living) విప‌రీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, బెంగ‌ళూరు, చెన్నై, హైద‌రాబాద్‌, గురుగ్రామ్ వంటి మెట్రో న‌గ‌రాల్లో సామాన్యులు జీవించ‌డం క‌ష్ట‌త‌రంగా మారింది. వ‌చ్చే అర‌కొర జీతం కాస్తా ఇంటి అద్దెలు, నిత్యావ‌స‌ర వ‌స్తువులు, స్కూల్ ఫీజులు, క‌రెంటు, నీళ్ల బిల్లులకే స‌రిపోతోంది. సేవింగ్స్ అన్న‌మాటే లేదు. ఈ క్ర‌మంలో తాజాగా గురుగ్రామ్‌కు చెందిన ఓ టెకీ (Gurugram Man) నెలవారీ ఖర్చుల (monthly expenditure) వివరాలు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి.

31 ఏళ్ల‌ గగన్ సైనీ (Gagan Saini) కార్పొరేట్ సంస్థ‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అత‌డు త‌న‌ నెల‌వారీ మొత్తం ఖర్చు రూ.2,44,000గా పేర్కొన్నాడు. అందులో తాను నివ‌సిస్తున్న 2.5 BHK ఫ్లాట్‌కు నెల అద్దె రూ.53,500 అని తెలిపాడు. నిత్యావసరాలకు రూ.15,927, వంట మనిషి, కార్ క్లీనింగ్ కోసం నెలకు రూ.8,450 ఖ‌ర్చ‌వుతున్న‌ట్లు వివ‌రించాడు. ఇక క్ర‌మం త‌ప్ప‌కుండా జిమ్‌కు వెళ్లే అలవాటున్న సైనీ, జిమ్ మెంబర్‌షిప్, సప్లిమెంట్స్ కోసం రూ.8,682 వెచ్చిస్తున్నాడు. డైనింగ్ అవుట్‌కు రూ.3,161 ఖ‌ర్చు అవుతున్న‌ట్లు చెప్పాడు. ఇంటి సెటప్ అండ్ మెయింటెనెన్స్, వైఫై, ఓటీటీ స‌బ్‌స్క్రిప్ష‌న్‌లు, పెట్రోల్ ఖ‌ర్చులు.. ఇలా మొత్తం త‌న జ‌న‌వ‌రి నెల ఖ‌ర్చు రూ.2,44,000 అని పేర్కొన్నాడు. నెల ఖ‌ర్చు ఇంత అయిన‌ప్ప‌టికీ.. సౌక‌ర్యం, లొకేష‌న్‌, భ‌ద్ర‌త‌కే తొలి ప్రాధాన్యం ఇస్తున్న‌ట్లు చెప్పుకొచ్చా డు. ప్ర‌స్తుతం అత‌డి నెల వారీ ఖ‌ర్చు హాట్‌టాపిక్ అవుతోంది.

దీనిపై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా కామెంట్లు చేస్తున్నారు. అంత అద్దె క‌ట్టేబ‌దులు సొత ఇల్లు కొనుక్కోవ‌చ్చు క‌దా అంటూ స‌ల‌హా ఇస్తున్నారు. మ‌రికొంద‌రేమో.. నువ్వు నెలకు చేసే ఖర్చు, నా సంవత్సర ఆదాయం కంటే ఎక్కువ అంటూ కామెంట్లు చేస్తున్నారు. జిమ్‌లు, ఓటీటీలకు అంత త‌గ‌లెట్ట‌డం అవ‌స‌రమా అంటూ మండిప‌డుతున్నారు. ల‌గ్జ‌రీ లైఫ్‌కోసం అంత ఖ‌ర్చు చేసే బ‌దులు సేవింగ్స్ చేసుకోవ‌చ్చు క‌ద అంటూ చుర‌క‌లంటిస్తున్నారు. లగ్జరీ లైఫ్ అలవాటైతే ఖర్చులు ఇలాగే ఉంటాయి మ‌రి అంటూ విమ‌ర్శిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Tirumala Snake Bite| తిరుమల క్యూలైన్ లో భక్తురాలికి పాముకాటు !
Nepal bus accident| నదిలో పడిన బస్సు..18మంది మృతి