Tobacco Ads | క్రికెట్ స్టేడియాల్లో పొగాకు ఉత్పత్తుల ప్రదర్శనపై నిషేధం..! కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయిన కేంద్రం..!
Tobacco Ads | పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనలపై కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించేలా ఉన్న ప్రకటనలపై ఇకపై క్రికెట్ స్టేడియాల్లో ప్రర్శించకూడదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి ఆదేశాలు జారీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
Tobacco Ads | పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనలపై కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించేలా ఉన్న ప్రకటనలపై ఇకపై క్రికెట్ స్టేడియాల్లో ప్రర్శించకూడదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి ఆదేశాలు జారీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. పాన్ మసాలాలు, పొగాకు మిశ్రమాలు ఉన్న చూయింగ్ గమ్, గుట్కా, పొగ రహిత పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన యాడ్స్‌ను క్రికెట్ మ్యాచులు జరిగే సమయంలో మైదానంలో ప్రదర్శించవద్దంటూ ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తున్నది. అంతేకాకుండా ఇకనుంచి ప్రజలను ఈ దురలవాటుకు బానిసను చేసేలా ప్రముఖ నటులు, మాజీ క్రికెటర్లు వీటిలో నటించకుండా ఆంక్షలు విధించేలా చర్యలు చేపట్టాలని సూచించనున్నట్లు తెలుస్తున్నది.
ఆయా యాడ్స్ ద్వారా పొగాకు ఉత్పత్తులను తీసుకునేందుకు ప్రజలను ప్రోత్సహించడమే అవుతుందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దేశ యువతపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదని తెలుస్తోందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఐసీఎంఆర్, గ్లోబల్ హెల్త్ ఆర్గనైజేషన్ అధ్యయనాల ప్రకారం.. పొగాకు ఉత్పత్తుల బ్రాండ్లకు చెందిన ప్రకటనల్లో 41.3శాతం యాడ్‌లను గతేడాది జరిగిన ప్రపంచకప్ టోర్నీ 17 మ్యాచ్‌ల్లో ప్రసారం అయ్యాయి. 2016-17లో ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆరోగ్య మంత్రిత్వశాఖ సర్వే ప్రకారం.. ఏటా 1.35 మిలియన్ల మంది వివిధ రూపాల్లో పొగాకు తీసుకుంటున్నారని తేలింది. ఈ క్రమంలో ప్రజారోగ్యం దృష్ట్యా కీలక చర్యలను కేంద్రం తీసుకునేందుకు సిద్ధమైందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటన చేయనబోతున్నట్లు తెలుస్తున్నది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram