ఎన్నికల ప్రచారంలో కూలిన హెలిక్యాప్టర్‌.. తప్పిన ప్రాణ నష్టం

మహారాష్ట్ర - రాయ్‌ఘడ్‌లోని మహద్‌ ప్రాంతంలో ఎన్నికల ప్రచారానికి వెలుతున్న శివసేన మహిళా నాయకురాలు సుష్మా అంధారే ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది.

  • By: Tech |    national |    Published on : May 03, 2024 1:39 PM IST
ఎన్నికల ప్రచారంలో కూలిన హెలిక్యాప్టర్‌.. తప్పిన ప్రాణ నష్టం

విధాత : మహారాష్ట్ర – రాయ్‌ఘడ్‌లోని మహద్‌ ప్రాంతంలో ఎన్నికల ప్రచారానికి వెలుతున్న శివసేన మహిళా నాయకురాలు సుష్మా అంధారే ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో సుష్మా అంధారే, పైలట్ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. అయితే హెలికాప్టర్ కూలిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సామాజిక మాద్యమాల్లో హెలిక్యాప్టర్ కూలిపోతున్న వీడియోలు వైరల్‌గా మారాయి. ప్రమాద స్థలంలో హెలిక్యాప్టర్ విడిభాగాలు పడిన తీరు ప్రమాద తీవ్రతను చాటాయి. అయితే ప్రాణ నష్టం వాటిల్లకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద దృశ్యం చూసిన వారు గతంలో ఎన్నికల ప్రచారంలో హెలిక్యాప్టర్ కూలి సినీ నటి సౌందర్య మరణించిన ఘటనను గుర్తు చేసుకుంటున్నారు.