Himachal Nurse : ఆరోగ్య కార్యకర్త కమలాదేవి అద్భుత సాహసం..వైరల్ గా వీడియో!

హిమాచల్‌ ప్రదేశ్‌లో కమలాదేవి ధైర్యంగా వాగు దాటి చిన్నారులకు టీకాలు వేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Himachal Nurse : ఆరోగ్య కార్యకర్త కమలాదేవి అద్భుత సాహసం..వైరల్ గా వీడియో!

Himachal Nurse | న్యూఢిల్లీ : విధి నిర్వహణలో హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) మండి జిల్లాలో ఆరోగ్య కార్యకర్త కమలాదేవి(Kamla Devi) చేసిన అద్భుత సాహసానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. చిన్నారులకు టీకాలు వేసేందుకు హురాంగ్ గ్రామానికి ఆరోగ్య కార్యకర్త కమలాదేవి చేరుకోవాల్సి ఉంది. అయితే గ్రామానికి వెళ్లే మార్గం వరదలు..కొండచరియాలు విరిగిపడటంతో మూసుకుపోయింది. తాజా వర్షాలు, వరదలతో ఆ మార్గంలో ఉన్న వాగు ప్రమాదరంగా ప్రవహిస్తుంది. అయితే విధి నిర్వహణలో రాజీ పడని నైజం కలిగిన కమలాదేవి ఎలాగైన గ్రామానికి వెళ్లి తీరాలనుకుంది.

ఉదృతంగా ప్రవహిస్తున్న వాగు దాటి, బండరాళ్లపై దూకుతూ ఆవలి ఒడ్డుకు చేరింది. గ్రామానికి వెళ్లి చిన్నారులకు టీకాలు వేసింది. కమలాదేవి సాహసోపేతంగా వాగు దాటుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా..అది చూసిన నెటిజన్లు విధి నిర్వహణలో ఆమె చేసిన ధైర్యంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.