Lok Sabha Elections | పార్ల‌మెంట్‌లో త‌గ్గుతున్న స్వ‌తంత్రుల ప్రాబ‌ల్యం..! ఈసారి 3 వేల మందిలో గెలిచేది ఎంద‌రో..?

Lok Sabha Elections | పంచాయ‌తీ నుంచి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల వ‌ర‌కు స్వ‌తంత్ర అభ్య‌ర్థులు పోటీలో ఉంటారు. ఆయా రాజ‌కీయ పార్టీల నుంచి టికెట్లు ద‌క్క‌ని వారు, రాజ‌కీయ పార్టీల‌తో ఎలాంటి సంబంధం లేని స్వ‌తంత్ర అభ్య‌ర్థులుగా పోటీ చేస్తుంటారు. ఇలా ఇండిపెండెంట్లుగా పోటీ చేసి గెలుస్తుంటారు. మొత్తానికి స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌కు విజ‌యావ‌కాశాలు త‌క్కువే.

Lok Sabha Elections | పార్ల‌మెంట్‌లో త‌గ్గుతున్న స్వ‌తంత్రుల ప్రాబ‌ల్యం..! ఈసారి 3 వేల మందిలో గెలిచేది ఎంద‌రో..?

Lok Sabha Elections | హైద‌రాబాద్ : పంచాయ‌తీ నుంచి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల వ‌ర‌కు స్వ‌తంత్ర అభ్య‌ర్థులు పోటీలో ఉంటారు. ఆయా రాజ‌కీయ పార్టీల నుంచి టికెట్లు ద‌క్క‌ని వారు, రాజ‌కీయ పార్టీల‌తో ఎలాంటి సంబంధం లేని స్వ‌తంత్ర అభ్య‌ర్థులుగా పోటీ చేస్తుంటారు. ఇలా ఇండిపెండెంట్లుగా పోటీ చేసి గెలుస్తుంటారు. మొత్తానికి స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌కు విజ‌యావ‌కాశాలు త‌క్కువే. కానీ స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత 1952లో జ‌రిగిన తొలి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్లు భారీగానే గెలుపొందారు. 1957, 1967 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోనూ భారీగానే విజ‌యం సాధించారు స్వ‌తంత్ర అభ్య‌ర్థులు. 1952, 9157, 9167 ఎన్నిక‌ల్లో రెండు డిజిట్ల‌లో ఉన్న స్వ‌తంత్రులు.. 2014, 2019 ఎన్నిక‌ల్లో సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం అయ్యారు. పార్ల‌మెంట్ ఎన్నికల్లో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుకుంటూ పోతుంది. కానీ పార్లమెంటులో వారి ప్రాతినిధ్యం మాత్రం తగ్గుతుంది. స్వ‌తంత్రుల ప్రాబ‌ల్యం త‌గ్గుతుంద‌న‌డానికి ఈ సంఖ్య‌నే నిద‌ర్శ‌నం.

1957లో అత్య‌ధికంగా 42 మంది ఇండిపెండెంట్లు గెలుపు

1952లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో 37 మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఈ ఎన్నిక‌ల్లో మొత్తం 1874 మంది పోటీ చేయ‌గా, అందులో 533 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. 360 మంది డిపాజిట్లు గ‌ల్లంత‌య్యాయి. 1957 లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికంగా 42 మంది స్వతంత్ర ఎంపీలు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో 1519 మంది అభ్యర్థుల్లో 481 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు. 1962లో 20 మంది గెలిచారు. 1967 ఎన్నిక‌ల్లో 35 మంది విజ‌యం సాధించి పార్ల‌మెంట్‌లో అడుగు పెట్టారు.

2019 ఎన్నిక‌ల్లో న‌లుగురే విజ‌యం

2014లో కేవలం ముగ్గురు ఇండిపెండెంట్లు మాత్రమే గెలిచారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 3,443 మంది స్వ‌తంత్రులు పోటీ చేశారు. కానీ గెలిచింది మాత్రం న‌లుగురే. 2019లో మహారాష్ట్రలోని అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన నవనీత్ రాణా ఈసారి బీజేపీ టికెట్‌పై పోటీ చేశారు. డామన్ డయ్యూ నుండి స్వతంత్ర ఎంపీగా గెలిచిన‌ మోహన్ డెల్కర్ కన్నుమూశారు. అస్సాంలోని కోక్రాజార్ నుంచి నబ హీరా కుమార్ సర్నియా, కర్ణాటకలోని మాండ్య లోక్‌సభ స్థానం నుంచి సుమన్ లతా అంబరీష్ స్వతంత్ర ఎంపీలుగా ఎన్నికయ్యారు.

ఈసారి గెలిచేది ఎంద‌రో..?

2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీలో 8,337 మంది అభ్య‌ర్థులు ఉన్నారు. వీరిలో జాతీయ పార్టీల నుంచి 1,333 మంది, ప్రాంతీయ పార్టీల నుంచి 532 మంది, గుర్తింపు లేని పార్టీల నుంచి 2,580 మంది, స్వతంత్రంగా 3,915 మంది అభ్యర్థులు ఉన్నారు. 3,915 మంది స్వ‌తంత్రుల్లో గెలిచేది ఎంద‌రో వేచి చూడాలి.