Republic Day : గణతంత్ర పరేడ్ లో ఆర్మీ న్యూ స్టెప్.. తొలిసారిగా ఆ జంతువులు
2026 గణతంత్ర పరేడ్‌లో భారత సైన్యం కొత్తగా జంతువుల బృందంతో కర్తవ్యపథ్‌పై కవాతు చేయనుంది. ఇది ఈసారి పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
విధాత : రానున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నిర్వహించే పరేడ్ కు భారత సైన్యం ఈ దఫా వినూత్నంగా సిద్దమవుతుండటం ఆసక్తికరం. భారత సైన్యానికి చెందిన రిమౌంట్ అండ్ వెటర్నరీ కార్ప్స్ (ఆర్‌వీసీ) ప్రత్యేకంగా ఎంపిక చేసిన జంతువుల బృందంతో కలిసి తొలిసారిగా 2026 గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో కర్తవ్యపథ్‌పై ప్రదర్శనకు సిద్దమవుతుంది.
ఈ బృందంలో రెండు బాక్ట్రియన్ ఒంటెలు, నాలుగు జాన్స్కార్ పోనీలు(పర్వత జాతి గుర్రాలు), నాలుగు వేట పక్షులు, పది భారతీయ జాతి సైనిక శునకాలు, అలాగే ఇప్పటికే ఆర్మీ సేవలో ఉన్న ఆరు సంప్రదాయ సైనిక శునకాలు ఉన్నాయి. వీటితో ఇండియర్ ఆర్మీ కవాతు బృందం జోరుగా రిహార్సల్స్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఆర్మీ చేయబోతున్న ఈ ప్రదర్శన ఈ దఫా గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణా నిలుస్తుందంటున్నారు నెటిజన్లు.
India will showcase a first-of-its-kind animal contingent from the Indian Army’s Remount and Veterinary Corps during the Republic Day 2026 parade.
The contingent will feature Bactrian camels, Zanskar ponies, raptors, Indian breed Army dogs, along military dogs already in service pic.twitter.com/aAokQSlwrw
— Defence Squad (@Defence_Squad_) December 31, 2025
ఇవి కూడా చదవండి :
Muslim Woman Dance In Old City : పాతబస్తీ వైకుంఠ ఏకాదశి వేడుకల్లో మైనార్టీ మహిళా డాన్స్ వైరల్
Real Estate | బ్రోకర్ సహాయం లేకుండానే సొంతింటి కల సాధ్యం..! అదేలాగంటే..?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram