ప్రకృతి సోయగాల గోవా అందాలను చూసొద్దాం రండి..! తక్కువ ధరకే పర్యాటకులకు ఐఆర్‌సీటీసీ బంపర్‌ టూర్‌ ప్యాకేజీ..!

ప్రకృతి సోయగాల గోవా అందాలను చూసొద్దాం రండి..! తక్కువ ధరకే పర్యాటకులకు ఐఆర్‌సీటీసీ బంపర్‌ టూర్‌ ప్యాకేజీ..!

విధాత‌: ఎటువైపు చూసినా సముద్రపు అలల సవ్వడులు.. తీరం మీదుగా వీచే పిల్లగాలులు.. వీటికి మించిన చారిత్రక కోటలు.. పర్యాటకానికే కేరాఫ్‌ అడ్రస్‌గా గోవా అందాలకు గురించి ఎంత ఎప్పుకున్నా తక్కువే. ప్రకృతి సోయగాల ప‌ర్యాట‌క ప్రాంతం. దేశంలో బెస్ట్‌ పర్యాటక ప్రాంతాల్లో గోవా ఒకటి. చాలా మంది గోవాకి రావాలని అనుకుంటారు.


అయితే, ఖర్చులు తడిసి మోపడవుతాయని ఇక్కడికి వచ్చేందుకు వెనుకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసం ఐఆర్‌సీటీసీ బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. తక్కువ బడ్జెట్‌లో గోవాను సందర్శించుకోవాలనుకునే వారికి సరికొత్త ఎయిర్‌ ప్యాకేజీని ప్రకటించింది. ప్యాకేజీలో తక్కువ ధరతోనే గోవాకు వెళ్లి రావొచ్చు.. మరెందుకు ఆలస్యం.. ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి..!


పర్యటన ఇలా..


ఐఆర్‌సీటీసీ గోవా రిట్రీట్‌ పేరుతో స్పెషల్‌ ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో దక్షిణ గోవా, ఉత్తర గోవాలోని అద్భుతమైన ప్రదేశాలను, బీచ్‌లను సందర్శించే అవకాశం ఉన్నది. ఈ ప్యాకేజీ టూర్‌ మూడు రాత్రులు, నాలుగు రోజులు కొనసాగనున్నది. నవంబర్‌ 2, 30 తేదీల్లో టూర్‌ కొనసాగనున్నది. ప్యాకేజీని బుక్‌ చేసుకున్న పర్యాటకులు తొలిరోజు మధ్యాహ్నం 12.50 గంటలకు విమానంలో బయలుదేరి గోవాకి వెళ్తారు. అక్కడ హోటల్‌లోకి చేరుకుతున్న తర్వాత జువారీ సందర్శిస్తారు. రాత్రి అక్కడే బస ఉంటుంది.


రెండోరోజు దక్షిణ గోవాలో పర్యటన ఉంటుంది. గోల్డ్‌ గోవా చర్చ్‌, బసిలికా ఆఫ్ బామ్ జీసస్, ఆర్కియలాజికల్ మ్యూజియం, పోర్ట్‌రైట్ గ్యాలరీ, వ్యాక్స్ వాల్డ్ మ్యూజియం, శ్రీ మంగేషీ ఆలయం, మిరామర్ బీచ్‌లను సందర్శిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు మండోవి నదిపై బోట్ క్రూజ్‌లోనూ ప్రయాణం చేయవచ్చు. మళ్లీ రాత్రికి హోటల్‌లో బస ఉంటుంది.


ఇక మూడోరోజు ఉత్తర గోవాలోని ఫోర్ట్ అగ్వాడా, కండోలిమ్ బీచ్, బాగా బీచ్‌ను సందర్శిస్తారు. ఆసక్తి ఉన్న సొంత ఖర్చులతో వాటర్‌ స్పోర్ట్‌లో పాల్గొనవచ్చు. ఆ తర్వాత అంజునా బీచ్, వాగేటర్ బీచ్, చపోరా ఫోర్ట్ సందర్శనకు వెళ్తారు. నాలుగో రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు మళ్లీ విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 3.55 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటారు. దీంతో పర్యటన ముగుస్తుది.


టూర్‌ ప్యాకేజీ ధర


ఐఆర్‌సీటీసీ ఈ గోవా రీట్రీట్‌ టూర్‌ ప్యాకేజీలో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి ఒక్కొక్కరు రూ.21,805 చెల్లించాల్సి ఉంటుంది. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.21,930, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.27,560 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీలో విమానం టికెట్స్, హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అన్నీ కవర్‌ అవుతాయి. ఆసక్తి ఉన్న వారు irctctourism.com వెబ్‌సైట్‌లో టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు.