Chiranjeevi | మన శంకర వర ప్రసాద్ గారు’ హిట్‌తో వెలుగులోకి సాయి ప్రియా రెడ్డి .. చిరంజీవి ఫేవరెట్ సీరియల్ హీరోయిన్ ఎవరు?

Chiranjeevi | ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాతో పలువురు నటీనటులు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పోషించిన పాత్రలో ఒక ప్రత్యేక ఎలిమెంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

  • By: sn |    movies |    Published on : Feb 13, 2026 3:52 PM IST
Chiranjeevi | మన శంకర వర ప్రసాద్ గారు’ హిట్‌తో వెలుగులోకి సాయి ప్రియా రెడ్డి .. చిరంజీవి ఫేవరెట్ సీరియల్ హీరోయిన్ ఎవరు?

Chiranjeevi | ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాతో పలువురు నటీనటులు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పోషించిన పాత్రలో ఒక ప్రత్యేక ఎలిమెంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమాలో ఆయన తరచూ ఒక టీవీ సీరియల్ చూస్తూ, అందులో నటించే హీరోయిన్ పాత్రతో ఎమోషనల్‌గా కనెక్ట్ అవడం ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఎంతో నచ్చింది.

ప్రస్తుతం ఈ సినిమా ZEE5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ మరింత మంది ప్రేక్షకులను అలరిస్తోంది. ఓటీటీలో కూడా మంచి వ్యూస్ సాధించడంతో సినిమాలో కనిపించిన చిన్న చిన్న పాత్రలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ముఖ్యంగా సీరియల్‌లో “సౌమ్య” పాత్రలో కనిపించిన నటి సాయి ప్రియా రెడ్డి పేరు ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారింది.

సీరియల్ సీన్స్‌లో చిరంజీవి పాత్ర ఆ కథానాయిక గురించి మాట్లాడటం, ఆమె జీవితం తన జీవితానికి ప్రతిబింబంలా అనిపించుకోవడం వంటి సన్నివేశాలు సినిమాకు భావోద్వేగాన్ని జోడించాయి. ఈ సీరియల్ పాత్ర ద్వారా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సాయి ప్రియా రెడ్డి అసలు జీవితంలో కూడా సినీ రంగంలోనే ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతోంది.

తెలుగమ్మాయి అయిన సాయి ప్రియా రెడ్డి చిన్నప్పటి నుంచే సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ వచ్చింది. ‘క్షేత్రం’, ‘నందీశ్వరుడు’, ‘పూలరంగడు’, ‘రెబెల్’, ‘మిర్చి’, ‘తడాఖా’, ‘జీనియస్’ వంటి పలు చిత్రాల్లో చిన్న పాత్రలతో కనిపించింది. తర్వాత యూట్యూబ్ వెబ్ సిరీస్‌ల ద్వారా కూడా మంచి గుర్తింపు సంపాదించింది. ఇటీవల సందీప్ కిషన్ నటించిన మజాకా, అలాగే విశ్వక్ సేన్ సినిమా లైలాల్లో కూడా తన నటనతో ఆకట్టుకుంది.

ఇప్పుడు ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాలో కీలకమైన సీరియల్ పాత్రలో కనిపించడం ఆమె కెరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్‌గా మారింది. స్టేజ్‌పై అవార్డు స్వీకరించిన సన్నివేశం కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెకు టాలీవుడ్‌లో కొత్త అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. ఒక చిన్న సీరియల్ పాత్ర ద్వారా పెద్ద స్థాయి గుర్తింపు పొందడం నిజంగా అరుదైన విషయమేనని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.