Ram Setu | రామసేతు నిజమే..! కీలక వివరాలు వెల్లడించిన ఇస్రో..!

Ram Setu | రామసేతు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామాయణకాలంలోనే నిర్మించిన వారధి అని భారతీయుల విశ్వాసం. దీన్ని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) పరిశోధన సైతం ధ్రువీకరిస్తున్నది!. రామేశ్వరం నుంచి శ్రీలంకలోని మన్నార్‌ దీవుల వరకు ఈ వారధి ఉంటుంది.

Ram Setu | రామసేతు నిజమే..! కీలక వివరాలు వెల్లడించిన ఇస్రో..!

Ram Setu | రామసేతు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామాయణకాలంలోనే నిర్మించిన వారధి అని భారతీయుల విశ్వాసం. దీన్ని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) పరిశోధన సైతం ధ్రువీకరిస్తున్నది!. రామేశ్వరం నుంచి శ్రీలంకలోని మన్నార్‌ దీవుల వరకు ఈ వారధి ఉంటుంది. అయితే, రామసేతుకు సంబంధించిన పలు రహస్యాల ఛేదనలో ఇస్రో మరో మైలురాయిని చేరింది. నాసాకు చెందిన ఉపగ్రహం సహాయంతో తొలిసారిగా ఆడమ్‌ బ్రిడ్జిగా పిలిచే రామసేతు మ్యాప్‌ను సిద్ధం చేసింది. ఈ వంతెనకు సంబంధించిన ఫొటోలను తాజాగా విడుదల చేసింది. ఇస్రో రూపొందించిన పది మీటర్ల మ్యాప్‌లో మొత్తం వంతెన కనిపిస్తుండడం విశేషం. ఇస్రో అమెరికాకు చెందిన ఉపగ్రహం ఏస్‌శాట్‌-2(ACESAT-2) డేటాను వినియోగించి సేతుకు సంబంధించిన మ్యాప్‌ను సిద్ధం చేసి విడుదల చేశారు.

అక్టోబర్ 2018 నుంచి 2023 అక్టోబర్ మధ్య ఆరు సంవత్సరాల డేటాను సిద్ధం చేశారు. ఇస్రోకు చెందిన జోధ్‌పూర్, హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌ల శాస్త్రవేత్తలు దీనిపై ఓ జర్నల్‌లో నివేదిక ప్రచురితమైంది. భారత్, శ్రీలంక మధ్యనున్న ఈ రామసేతు పొడవు 29 కిలోమీటర్ల ఉంటుంది. సముద్రగర్భం నుంచి దీని ఎత్తు 8 మీటర్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటి వరకు ఈ సేతు 99.98 శాతం నీటిలో మునిగి ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు తెలిపారు. రామాయణ కాలంలో లంకాధిపతి రావణుడు సీతమ్మ అమ్మవారిని అపహరించాడు. ఆమెను అక్కడే ఉంచాడు. హనుమంతుడు లంకాయాణం చేసి సీతమ్మ జాడను కనుగొంటాడు. ఆ తర్వాత లంకకు చేరుకునేందుకు సముద్రంపై వంతెనను వానరసేన నిర్మించింది. ఆ సేతుపై నుంచే వానరసేన లంకకు చేరుకుంది. అయితే, క్రీస్తుశకం 9వ శతాబ్దం వరకు పర్షియన్లు ఈ వంతెనను ‘సేతు బంధై’ గా పిలుస్తుండే వారు. రామేశ్వరం ఆలయ రికార్డుల ప్రకారం.. ఈ వంతెన 1480 వరకు తుఫానులతో ధ్వంసమైంది. అంతకు ముందు సముద్రమట్టానికి పైనే ఉండేది.