Operation Sindoor | ఆప‌రేష‌న్ సిందూర్.. జైషే చీఫ్ మ‌సూద్ అజార్ కుటుంబం హ‌తం

Operation Sindoor | ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి( Pahalgam Terror attack )కి ప్ర‌తీకారంగా ఉగ్ర‌వాద సంస్థల స్థావ‌రాల‌పై భార‌త సైన్యం( Indian Army ) మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో ల‌ష్క‌రే తోయిబా( Lashkar-e-Taiba ), జైషే మ‌హ్మ‌ద్( Jaish-e-Mohammed ) ఉగ్ర‌వాద స్థావ‌రాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని మిస్సైళ్ల‌ను ప్ర‌యోగించింది.

  • By: raj |    national |    Published on : May 07, 2025 3:15 PM IST
Operation Sindoor | ఆప‌రేష‌న్ సిందూర్.. జైషే చీఫ్ మ‌సూద్ అజార్ కుటుంబం హ‌తం

Operation Sindoor | విధాత : ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి( Pahalgam Terror attack )కి ప్ర‌తీకారంగా ఉగ్ర‌వాద సంస్థల స్థావ‌రాల‌పై భార‌త సైన్యం( Indian Army ) మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో ల‌ష్క‌రే తోయిబా( Lashkar-e-Taiba ), జైషే మ‌హ్మ‌ద్( Jaish-e-Mohammed )
ఉగ్ర‌వాద స్థావ‌రాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని మిస్సైళ్ల‌ను ప్ర‌యోగించింది. బ‌హ‌వ‌ల్పూర్‌లో 18 ఎక‌రాల్లో ఉన్న‌ జైషే మ‌హ్మ‌ద్, మురిద్కేలో 200 ఎక‌రాల్లో ఉన్న ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాద స్థావ‌రాల‌ను నిమిషాల వ్య‌వ‌ధిలోనే భార‌త సైన్యం నేల‌మ‌ట్టం చేసింది.

ఈ మెరుపుదాడుల్లో జైషే మహ్మద్‌ చీఫ్‌ (Jaish-e chief) మౌలానా మసూద్‌ అజార్‌ కుటుంబం మొత్తం హతమైనట్లు తెలుస్తోంది. జైషే చీఫ్ మ‌సూద్ అజార్‌కు చెందిన 10 మంది కుటుంబ సభ్యులు, నలుగురు సహాయకులు భార‌త సైన్యం దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన‌ట్లు స‌మాచారం. ఇక జైషే చీఫ్‌ ప్రాణాలతోనే ఉన్నట్లు తెలిసింది. భారత్‌ జరిపిన దాడిలో తన కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయినట్లు మసూద్ అజారే స్వయంగా వెల్లడించినట్లు జాతీయ, అంతర్జాతీయ మీడియా నివేదిస్తోంది.

భార‌త సైన్యం మెరుపుదాడుల్లో మసూద్‌ అజార్ సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య, మేనకోడలు, ఐదుగురు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. వీరితోపాటు పలువురు అజార్‌ స్నేహితులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ సందర్భంగా భారత్‌కు మసూద్‌ డెడ్లీ వార్నింగ్‌ ఇచ్చినట్లు సమాచారం. దాడికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ హెచ్చరించినట్లు తెలుస్తోంది.