లైంగిక వాంఛల కట్టడిపై క‌ల‌క‌త్తా హైకోర్టు వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టిన సుప్రీం

యుక్త వయసులో ఉన్న బాలికలు లైంగిక వాంఛల విషయంలో కట్టడిలో ఉండాలంటూ క‌ల‌క‌త్తా హైకోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌ను సుప్రీంకోర్టు తప్పుపట్టింది

లైంగిక వాంఛల కట్టడిపై క‌ల‌క‌త్తా హైకోర్టు వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టిన సుప్రీం

విధాత‌: యుక్త వయసులో ఉన్న బాలికలు లైంగిక వాంఛల విషయంలో కట్టడిలో ఉండాలంటూ క‌ల‌క‌త్తా హైకోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌ను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సూమోటోగా తీసుకున్నది. న్యాయమూర్తులు ఉద్బోధనలు, సొంత అభిప్రాయాలు వ్యక్తం చేయరాదని వ్యాఖ్యానించింది.


యుక్త వయసులో ఉన్న బాలికలు రెండు నిమిషాల సుఖం కోసం సమాజంలో తలదించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని కలకత్తా హైకోర్టు పేర్కొనడంపై ఈ మేరకు సుప్రీంకోర్టు స్పందించింది. కౌమారదశలో ఉన్న బాలలకు వ్యక్తిగత గోప్యత హక్కు కల్పిస్తున్న ఆర్టిక‌ల్‌ 21ని భంగపర్చేలా వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నది. కలకత్తా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసిన కేసులో బెంగాల్‌ ప్రభుత్వానికి, నిందితుడికి, బాధిత బాలికకు నోటీసులు జారీ చేసింది.