ఆలయంలో చిరుత పులి పిల్ల కలకలం

విధాత : అడవిలో తిరుగాడాల్సిన ఓ చిరుత పులి పిల్ల తప్పిపోయి ఓ ఆలయంలో దర్శనమివ్వడం కలకలం రేపింది. హర్యానాలోని పంచకులలోని పించోర్ జిల్లాలోని ఓ ఆలయంలో చిరుత పులిపిల్ల కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. చాకచక్యంగా చిరుత పులిపిల్లను సురక్షితంగా పట్టుకుని రక్షించారు. అనంతరం ఆ చిరుత పులి పిల్లను సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. సమీప అటవీ ప్రాంతం నుంచి అది తల్లి నుండి తప్పిపోయి ఆలయానికి చేరినట్లుగా భావిస్తున్నారు. అందుకే దానిని తిరిగి అడవిలోనే వదిలేసి తల్లి వద్దకు చేరేలా అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
హర్యానా: ఆలయంలో చిరుత పులిపిల్ల కలకలం!
పంచకుల జిల్లా పించోర్లోని ఓ ఆలయంలో చిరుత పులిపిల్ల కనిపించడంతో భయాందోళన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి పులిపిల్లను సురక్షితంగా పట్టుకొని సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.#Haryana #Leopard #Wildlife… pic.twitter.com/iYeDcTXovd— Bhala Media (@Bhalamedia) July 16, 2025