King Cobra Attack| కింగ్ కోబ్రా రచ్చ రచ్చ…!

విధాత : అసలే అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా(King Cobra rescue)..పట్టుకోవడంలో ఏ మాత్రం తేడా వచ్చిన చుక్కలు చూడాల్సిందే. సరిగ్గా అలాంటి వ్యవహారం డెహ్రాడూన్ లో చోటుచేసుకుంది. డెహ్రాడూన్ (Dehradun)లోని ఒక ఇంటిలో చొరబడిన కింగ్ కోబ్రా పాము అందరిని పరుగులు పెట్టించింది. ఇంట్లో భారీ కింగ్ కోబ్రా(dangerous cobra inside house)ను చూసిన కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై వెంటనే అటవీ శాఖ అధికారుల(Forest Officials)కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ సిబ్బంది ఇంట్లోని కింగ్ కోబ్రాను బయటకు రప్పించడంలో నానాపాట్లు పడ్డారు. ఆ తర్వాత దానిని సంచిలో బంధించే(snake rescue operation) క్రమంలో పట్టు తప్పారు. అంతే వారి నుంచి తప్పించుకున్న కింగ్ కోబ్రా అటవీ సిబ్బందికి చుక్కలు చూపించింది.
పట్టుకోవడానికి ప్రయత్నించిన సిబ్బందికి చిక్కకుండా పరుగులు తీస్తూ కాటేసే ప్రయత్నం చేసింది. చెట్టు ఎక్కి మీదకు దూకేసింది. సిబ్బంది ఏ మాత్రం ధైర్య సాహసాలు సఢలిపోకుండా చాలా శ్రమించి కింగ్ కోబ్రాను సురక్షితంగా బంధించారు. ఆ సమయంలో వారంతా కూడా ఊపిరి ఆడక, చెమటలు కక్కి తీవ్ర టెన్షన్ కు గురయ్యారు. కింగ్ కోబ్రా చాల దూకుడుగా వ్యవహరించిందని..అందుకే పట్టుకోవడంలో ఇబ్బంది ఎదురయ్యిందని సిబ్బంది తెలిపారు. ఆ తర్వాత దానిని దూరంగా అటవీ ప్రాంతంలో వదిలారు.
देहरादून में एक घर से निकले किंग कोबरा ने दहशत का माहौल पैदा कर दिया। अचानक सांप को देखकर घरवाले घबरा गए और तुरंत वन विभाग को सूचना दी। मौके पर पहुंचे वन कर्मियों ने काफी मशक्कत के बाद किंग कोबरा को सुरक्षित रेस्क्यू किया, इस दौरान उनकी भी सांसें थमी रहीं और पसीने छूट गए।… pic.twitter.com/IxAN6WYsVM
— ABP News (@ABPNews) August 31, 2025