Leopard | గండిపేట‌లో చిరుత పులి సంచారం.. వీడియో

Leopard | చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణాన్ని ఆస్వాదించేందుకు మీరు గండిపేట( Gandipet ) వైపు వెళ్తున్నారా..? అయితే అటు వైపు వెళ్ల‌కండి.. ఎందుకంటే చిరుత పులి( Leopard ) సంచరిస్తోంది. ఇది నిజ‌మే. అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో చిరుత సంచారం దృశ్యాలు రికార్డు అయ్యాయి. మ‌రి మీరు జ‌ర జాగ్ర‌త్త‌.

  • By: raj |    telangana |    Published on : Jul 24, 2025 9:13 PM IST
Leopard | గండిపేట‌లో చిరుత పులి సంచారం.. వీడియో

Leopard | హైద‌రాబాద్ : హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌ర శివారు ప్రాంతాల్లో చిరుత పులులు( Leopards ) అల‌జ‌డి సృష్టిస్తున్నాయి. మొన్న ఆర్‌సీఐ వ‌ద్ద చిరుత పులి సంచ‌రిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన ఘ‌ట‌న మ‌రువ‌క ముందే.. తాజాగా గండిపేట‌( Gandipet )కు స‌మీపంలోని గ్రే హౌండ్స్ ట్రైనింగ్ సెంట‌ర్( Greyhounds training centre ) గ్రౌండ్స్‌లో ఓ చిరుత పులి( Leopard ) సంచారం క‌ల‌క‌లం సృష్టిస్తుంది.

హై సెక్యూరిటీ ఉన్న గ్రే హౌండ్స్ ట్రైనింగ్ సెంట‌ర్‌లో గురువారం ఉద‌యం 7.40 గంట‌ల‌కు చిరుత అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. రోడ్డును దాటుతున్న దృశ్యాలు కెమెరా కంట చిక్కాయి. అయితే ఆ ప్రాంతంలో కుక్క‌లు కూడా సంచ‌రించేవి. పులి దాడికి య‌త్నించ‌డంతోనే కుక్క‌లు క‌నిపించ‌కుండా పోయిన‌ట్లు పోలీసులు, అట‌వీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.

గ్రే హౌండ్స్ క్యాంప‌స్‌లో సంచ‌రిస్తున్న చిరుత‌ను ప‌ట్టుకునేందుకు అట‌వీ శాఖ అధికారులు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు. ప్ర‌త్యేక బోన్లు ఏర్పాటు చేయ‌డంతో పాటు.. మ‌రింత నిఘా పెంచారు. చిరుత క‌ద‌లిక‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నించేందుకు ప్ర‌త్యేక సీసీటీవీ కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. చిల్కూర్, హిమాయ‌త్ సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ ప్రాంతాల నుంచి గ్రే హౌండ్స్ గ్రౌండ్‌లోకి చిరుత ప్ర‌వేశించిన‌ట్లు అనుమానిస్తున్నారు.

చిరుత‌పులి సంచారం నేప‌థ్యంలో స్థానికంగా ఉన్న నివాసితుల‌ను అట‌వీశాఖ అధికారులు అప్ర‌మ‌త్తం చేశారు. ఒంట‌రిగా తిర‌గొద్ద‌ని, పులి క‌నిపిస్తే వెంట‌నే త‌మ‌కు స‌మాచారం అందించాల‌ని కోరారు. పిల్ల‌ల‌ను బ‌య‌ట‌కు పంపించొద్ద‌ని సూచించారు.