10 అడుగుల ఎత్తు ఎగిరి.. కోడి పుంజును వేటాడిన చిరుత పులి.. వీడియో

Viral Video | చిరుత పులులు త‌మ కంటికి ప్రతి జీవిని వెంటాడి వేటాడుతాయి. చివ‌ర‌కు ఆ జీవి ర‌క్తాన్ని క‌ళ్లారా చూస్తాయి. చివ‌ర‌కు ఓ చిరుత కోడి పుంజును కూడా వ‌ద‌ల్లేదు. మ‌రి 10 అడుగుల ఎత్తు ఎగిరి కోడి పుంజును వేటాడింది చిరుత పులి. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

10 అడుగుల ఎత్తు ఎగిరి.. కోడి పుంజును వేటాడిన చిరుత పులి.. వీడియో

చిరుత పులులు త‌మ కంటికి ప్రతి జీవిని వెంటాడి వేటాడుతాయి. చివ‌ర‌కు ఆ జీవి ర‌క్తాన్ని క‌ళ్లారా చూస్తాయి. చివ‌ర‌కు ఓ చిరుత కోడి పుంజును కూడా వ‌ద‌ల్లేదు. మ‌రి 10 అడుగుల ఎత్తు ఎగిరి కోడి పుంజును వేటాడింది చిరుత పులి. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరులో మే 29వ తేదీన తెల్ల‌వారుజామున 5 గంట‌ల‌కు ఓ కోడి పుంజు 10 అడుగుల ఎత్తులో ఉన్న గోడ‌పై నిల్చుంది. కోడిని ప‌సిగ‌ట్టిన చిరుత‌.. దాన్ని వేటాడాల‌ని నిర్ణ‌యించుకుంది. ఇంకేముంది.. 10 అడుగుల ఎత్తులో ఉన్న గోడ‌పైకి చిరుత దూకింది. అంత‌లోనే కోడి పుంజు కింద‌కు దూకింది. క్ష‌ణాల్లోనే చిరుత కూడా కింద‌కు దూకి.. కోడి పుంజును చిదిమేసింది. త‌న నోటితో కోడి పుంజును పట్టుకుని అటు నుంచి చిరుత పులి వెళ్లిపోయింది.

ఈ దృశ్యాల‌న్నీ ఆ ఇంటి వ‌ద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. కోడిపుంజును చిరుత వేటాడిన దృశ్యాల‌ను చూసి స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై అట‌వీశాఖ అధికారుల‌కు స‌మాచారం అందించారు.