Samantha second marriage| సమంత రెండో పెళ్లి చేసుకుంది…!

ప్రముఖ నటి సమంత రెండో పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులుగా దర్శకుడు రాజ్ నిడిమోరుతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. సోమవారం ఉదయం కోయంబత్తూర్ లోని ఈషా యోగ సెంటర్లోని లింగ బైరవి ఆలయంలో వారిద్దరు పెళ్లి చేసుకున్నారని సమాచారం.

Samantha second marriage| సమంత రెండో పెళ్లి చేసుకుంది…!

విధాత : ప్రముఖ నటి సమంత(Samantha) రెండో పెళ్లి(second marriage) చేసుకున్నారు. కొన్ని రోజులుగా దర్శకుడు రాజ్ నిడిమోరుతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. సోమవారం ఉదయం కోయంబత్తూర్(Coimbatore)లోని ఈషా యోగ సెంటర్లో(Isha Yoga Centre)ని లింగ బైరవి ఆలయంలో వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికి కూడా ఇది రెండో పెళ్లి కావడం విశేషం. వారి పెళ్లిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

రాజ్‌- డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ‘ది ఫ్యామిలీమ్యాన్‌ సీజన్‌ 2’, ‘సిటడెల్‌: హనీ బన్నీ’లో సమంత నటించిన సంగతి తెలిసిందే. ఆయా ప్రాజెక్ట్‌ల కోసం వర్క్ చేస్తున్న సమయంలోనే రాజ్‌కు, ఆమెకు మధ్య స్నేహం ఏర్పడింది. సమంత నిర్మించిన ‘శుభం’ చిత్రానికి రాజ్‌ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. ఆ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో వీరి ఫొటోలు వైరల్‌ అయ్యాయి. తాజాగా వీరు వివాహం చేసుకున్నట్లు వార్తలు రావడంతో నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సమంత టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్యను 2017ఆక్టోబర్ లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం వారి మధ్య నెలకొన్న విబేధాల నేపథ్యంలో 2021ఆక్టోబర్ లో అధికారికంగా విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత నాగ చైతన్య తన మిత్రురాలైన శోభిత దూళిపాళను పెళ్లి చేసుకున్నారు. తాజాగా సమంత కూడా రాజ్ నిడిమోరుతో రెండో పెళ్లి చేసుకోవడం విశేషం. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ నిర్మాణం సందర్భంగా మొదలైన వారి పరిఛయం పెళ్లికి దారితీసింది. రాజ్ నిడిమోరు తన భార్య శ్యామిలిదేతో 2022లో విడిపోయారని తెలుస్తుంది. 2015లో శ్యామలిదేను రాజ్ నిడిమోరు పెళ్ల చేసుకున్నారు. సమంత, రాజ్ బంధంపై శ్యామిలిదే తాజాగా స్పందిస్తూ..తెగించిన వారి ఏమైన చేస్తారు అంటూ ఓ పోస్టు పెట్టింది.