అసియా సింహల జనాభాకు ప్రసిద్ది గాంచిన గుజరాత్ గిర్ ప్రాంతంలో ఓ ఆడ సింహం పశువుల కాపరిపై దాడి చేసిన ఘటన వైరల్ మారింది. గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లా, పలితానా పరిధిలోని గర్జియా గ్రామంలో పశువుల కాపరిపై సింహం దాడి చేసింది. గ్రామానికి చెందిన పొలాల ప్రాంతంలో ఉన్న ఒక పశువుల కాపరి ఇంటి సమీపంలో ఈ సింహం దాడికి పాల్పడింది.
వ్యక్తిపై సింహం దాడిని గమనించిన స్థానికులు గట్టిగా కేకలు వేయడంతో సింహం అతడిని వదిలేసి దూరంగా పరుగెత్తెంది. గాయపడిన పశువుల కాపరిని చికిత్స నిమిత్తం స్థానికులు పలితానాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గిర్ అడవుల నుండి ఆసియా సింహాలు తరుచూ సమీప గ్రామాలు. ఆలయ సమీప ప్రాంతాలకు వస్తుండటంతో అక్కడ మనుషులపై సింహల దాడి ఘటనలు వెలుగుచూస్తున్నాయి.
ప్రపంచంలోనే ఆసియా సింహాలకు గుజరాత్‌లోని గిర్ నేషనల్ పార్క్ (గిర్ అడవులు) ఏకైక సహజ ఆవాసం. ఆఫ్రికన్ సింహాల కంటే చిన్నవిగా ఉండే ఈ సింహాలు, కనుమరుగయ్యే దశ నుంచి రక్షించబడి ప్రస్తుతం గుజరాత్ వ్యాప్తంగా విస్తరించాయి. భారతదేశంలో ఆసియా సింహాలు కేవలం గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతంలో మాత్రమే జీవిస్తున్నాయి. గుజరాత్ అటవీ శాఖ లెక్కల ప్రకారం, 2020లో 674 ఉన్న సింహాల సంఖ్య 2026 నాటికి 900కు పైగా పెరిగింది. పెరిగిన ఆసియా సింహల జనాభా కారణంగా వాటిలో 50శాతం సింహాలు అహార అన్వేషణలో భాగంగా రక్షిత అటవీ ప్రాంతాల వెలుపల, గ్రామాలలో, సముద్ర తీర ప్రాంతాల్లో కూడా స్వేచ్ఛగా సంచరిస్తుండటంతో మనుషులు వాటి దాడుల బారిన పడే ఘటనలు పెరుగుతున్నాయి.
भावनगर में शेरनी ने युवक पर हमला किया
हमले का LIVE वीडियो आया सामने
पालिताना के गरजीया गांव में किसान पर किया हमला #livevideo #lion #gujarat pic.twitter.com/xrcbFZW1TA
— Naresh Parmar (@nareshsinh_007) July 6, 2026
