Lok Sabha elections | తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్‌ల ఘట్టం.. బరిలో ఎందరు మిగిలారంటే..!

Lok Sabha elections | తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు, ఆంధప్రదేశ్‌ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్‌ల ఘట్టం ముగిసింది. రెండు రాష్ట్రాల్లో అభ్యర్థుల నామినేషన్‌ల దాఖలు, అధికారుల స్క్రూటినీ, నామినేషన్‌ల ఉససంహరణలు అన్నీ ముగిశాయి. తిరస్కరించిన నామినేషన్‌లు, ఉపసంహరించుకున్న నామినేషన్‌లు పోను ఎన్నికల బరిలో మిగిలిన అభ్యర్థుల జాబితాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

Lok Sabha elections | తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్‌ల ఘట్టం.. బరిలో ఎందరు మిగిలారంటే..!

Lok Sabha elections : తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు, ఆంధప్రదేశ్‌ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్‌ల ఘట్టం ముగిసింది. రెండు రాష్ట్రాల్లో అభ్యర్థుల నామినేషన్‌ల దాఖలు, అధికారుల స్క్రూటినీ, నామినేషన్‌ల ఉససంహరణలు అన్నీ ముగిశాయి. తిరస్కరించిన నామినేషన్‌లు, ఉపసంహరించుకున్న నామినేషన్‌లు పోను ఎన్నికల బరిలో మిగిలిన అభ్యర్థుల జాబితాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

దేశవ్యాప్తంగా 7 విడతల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా తెలంగాణ, ఏపీ లోక్‌సభ ఎన్నికలతోపాటు.. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ జరగనుంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. ఏప్రిల్ 25 వరకూ నామినేషన్లు స్వీకరించారు. ఏప్రిల్ 29తో నామినేషన్‌ ఉపసంహరణ గడువు ముగిసింది. దాంతో బరిలో మిగిలిన అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. మే 13న నాలుగో విడత ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నారు.

ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకుగాను 893 మంది అభ్యర్థులు 1488 సెట్ల నామినేషన్‌లు దాఖలు చేశారు. అధికారుల స్క్రూటినీ అనంతరం 625 నామినేషన్‌లు మాత్రమే ఆమోదం పొందాయి. మరో 100 మంది నామినేషన్‌లను ఉపసంహరించుకోవడంతో 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఏపీలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలకు 731 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం 503 మంది బరిలో నిలిచారు. నంద్యాల పార్లమెంటుకు అత్యధికంగా 36 నామినేషన్లు, రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి అత్యల్పంగా 12 నామినేషన్లు ఆమోదం పొందాయి.

ఇక ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు 4,210 నామినేషన్లు దాఖలు కాగా.. చివరికి 2,705 మంది బరిలో నిలిచారు. వారిలో తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి అత్యధికంగా 48 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, చోడవరం అసెంబ్లీ స్థానం నుంచి అత్యల్పంగా ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు పోలింగ్‌ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. జూన్‌ 4న ఈ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.