చిన్నారులను కంటికి రెప్పలా కాచుకోవాల్సిన అంగన్వాడీ సిబ్బంది ఓ చిన్నారిని కాలితో తన్ని అమానుషంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపుతుంది. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా పన్వెల్ తాలుకా నందగావ్ గ్రామంలో అంగన్‌వాడీ సెంటర్ లో ఓ చిన్నారి పట్ల ఓ మహిళ క్రూరంగా ప్రవర్తించిన వీడియో వైరల్ గా మారింది. అంగన్వాడీ కేంద్రానికి వెళ్లనంటూ ఏడుస్తున్న చిన్నారిని ఆ మహిళ కాలితో తన్నడంతో ఆ చిన్నారి మెట్ల మీదుగా దొర్లి పడింది.
ఈ ఘటన చూసిన నెటిజన్లు ఆ మహిళ ప్రవర్తించిన తీరు చూస్తే చిన్నారులను అంగన్వాడీలు, బడులకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఏర్పతుందని మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు విచారణ చేపట్టారు. ఘటన జరిగిన అంగన్వాడీ సెంటర్ సిబ్బందిని సస్పెండ్ చేసి..కేసు నమోదు చేయాలని ఆదేశించినట్లుగా సమాచారం.
“అంగన్వాడీ కేంద్రంలో చిన్నారిపై దాడి.. వైరల్ వీడియోపై ఆగ్రహం”
మహారాష్ట్రలోని పన్వెల్ సమీపంలోని నంద్‌గావ్ అంగన్వాడీ కేంద్రంలో ఓ మహిళా సిబ్బంది చిన్నారిని కాలితో తన్నినట్లు కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.#Maharashtra #ChildSafety #Viralvideo pic.twitter.com/zcVNaii4LX
— Telugu Stride (@TeluguStride) June 26, 2026