Teacher Brutality| విద్యార్థిపై ఉపాధ్యాయుడి అమానుషం!

మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని వేద పాఠశాల ఉపాధ్యాయుడు క్రమశిక్షణ పేరుతో విద్యార్థిని కర్రతో చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపింది.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Mar 22, 2026, 1:32 pm IST
Read Time: 3 mins
Teacher Brutality| విద్యార్థిపై ఉపాధ్యాయుడి అమానుషం!

విధాత : విద్యాబుద్దులు నేర్పి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడే తన విద్యార్థిపై అమానుషంగా ప్రవర్తించిన ఘటన వైరల్ గా మారింది. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని వేద పాఠశాల ఉపాధ్యాయుడు క్రమశిక్షణ పేరుతో విద్యార్థిని కర్రతో చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపింది.

హాస్టల్ లో తోటి విద్యార్థి మంచంపై పడుకున్నాడనే చిన్న కారణంతో వేద విద్యార్థిని ఆ ఉపాధ్యాయుడు, వార్డెన్ గా పని చేస్తున్న దత్తదాస్ షెవ్డే చితక బాదాడు. కనీసం సాటి ఉపాధ్యాయులైన విచక్షణ మరిచి పిల్లాడిని కొడుతున్న ఉపాధ్యాయుడిని అడ్డుకోకపోవడం మరింత అన్యాయంగా కనిపించింది. దెబ్బలకు తాళలేక విద్యార్థి విలవిలలాడిపోయిన ఆ గురువు కనికరించకుండా వాతలు వచ్చేలా చితక్కొట్టాడు. విద్యార్థి తప్పులు చేస్తే అలా చేయరాదని చెప్పకుండా విచక్షణ మరిచి అమానుషంగా చితకబాదిన ఉపాధ్యాయుడి తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.