12 కోట్ల విలువైన డ్ర‌గ్స్ సీజ్‌

12 కోట్ల విలువైన డ్ర‌గ్స్ సీజ్‌
  • మయన్మార్ సరిహద్దు సమీపంలో
  • మెథాంఫెటమిన్ మాత్ర‌లు స్వాధీనం


విధాత‌: మయన్మార్ సరిహద్దులో రూ.12 కోట్ల విలువైన డ్ర‌గ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిజోరాం రాష్ట్రంలోని ఛాంఫై జిల్లాలో రూ.12 కోట్ల విలువైన మెథాంఫెటమిన్ మాత్రలను స్వాధీనం చేసుకొన్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అస్సాం రైఫిల్స్ శనివారం ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.


త‌మ‌కు అందిన పక్కా సమాచారం మేరకు అస్సాం రైఫిల్స్, ఎక్సైజ్ అండ్ నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది గురువారం మయన్మార్ సరిహద్దుకు సమీపంలోని జోట్ ప్రాంతంలో 40,400 మెథాంఫెటమిన్ ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిని అస్సాంలోని కరీంగంజ్ పట్టణానికి చెందిన అల్తాబ్ ఉద్దీన్ (32), అనమ్ ఉద్దీన్ (32)గా గుర్తించారు. పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.