- పాక్ విషయంలో ఇదే మా వైఖరి
- అమెరికాకు తేల్చిచెప్పిన మోదీ
- పాక్ తూటా పేలిస్తే.. క్షిపణితో బదులు
- త్రివిధ దళాలకు ప్రధాని సూచన
Operation Sindoor | పాకిస్తాన్ ఒక్క తూటా పేల్చినా.. మీరు క్షిపణితో సమాధానమివ్వండని భారత త్రివిధ దళాలకు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కాల్పుల విరమణ.. ఆపరేషన్ సిందూర్ అంశాలపై ఆదివారం తన నివాసంలో హైలెవల్ కమిటీ భేటీ నిర్వహించారు. అనంతరం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ.. పాకిస్తాన్ విషయంలో తమ వైఖరిని స్పష్టం చేశారు. కశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఒక్కటేనని జేడీ వాన్స్ కు మోదీ స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్ కు అప్పగించడం, ఉగ్రవాదులను సరెండర్ చేయడంపైన పాకిస్తాన్‌తో తమ చర్చలు ఉంటాయన్నారు. పీవోకేను భారత్‌కు అప్పగించడం తప్ప పాక్ కు మరో గత్యంతరం లేదన్నారు. ఉగ్రవాదులను అప్పగిస్తేనే తాము వాళ్లతో మాట్లాడుతామని తేల్చి చెప్పారు. మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగిసిపోలేదన్నారు. పాక్ కాల్పులు జరిపితే.. భారత్ కూడా కాల్పులు జరుపుతుందన్నారు. కాల్పుల విరమణపై పాక్ తన చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. ప్రధాని మోదీ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో సోమవారం రెండు దేశాల సైనికాధికారుల మధ్య చర్చలే భవిష్యత్తు యుద్దాన్ని నిర్ణయించడంలో కీలకం కానున్నాయని నిపుణులు చెబుతున్నారు.
పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయండి : ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ
భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితుకు బ్రేక్ వేస్తూ ఇరు దేశాలు చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందం.. ఆపరేషన్ సిందూర్ అంశాలపై చర్చించేందుకు తక్షణమే పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలని లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను వెంటనే ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు ఏకగ్రీవంగా తీర్మానించాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌తోపాటు కాల్పుల విరమణ ఒప్పందంపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చించడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి మనమంతా ఇలా సమావేశమై నిర్ణయం తీసుకోనే అవకాశం లభిస్తోందని ఆయన లేఖలో పేర్కొన్నారు. తన ఈ డిమాండ్‌పై వెంటనే స్పందించి.. నిర్ణయం తీసుకుంటారని రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు.
అయితే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ రాసిన లేఖపై మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. ఈ అంశంపై గతంలోనే ప్రధానికి లేఖ రాశానని చెప్పారు. ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ రాసిన లేఖకు తాను మద్దతు తెలుపుతున్నానని ఈ సందర్భంగా ఖర్గే స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ రాసిన లేఖ పట్ల ప్రధాని మోదీ సానుకూలంగా స్పందిస్తారని ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే అఖిల పక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసి తాజా పరిస్థితులను కేంద్రం వివరించాలని ఖర్గే కోరారు.
ఇవి కూడా చదవండి..
Snake in Train | వేగంగా దూసుకుపోతున్న రైలు.. టాయ్‌లెట్‌లో పాము!
KA paul | నన్ను టర్కీ, పాక్ వెళ్లకుండా ఆపారు : ఎయిర్‌పోర్టులో కేఏ పాల్ లొల్లి
Pulwama attack | పుల్వామా ఉగ్రదాడిలో తమ ప్రమేయం ఉందన్న ఔరంగజేబ్
ఎక్కువ మంది చదివిన వార్తలు
Tectonic Interactions | మీరు నమ్మలేరు.. రెండు ముక్కలుగా చీలనున్న భారతదేశం!
SkyLab | హమ్మయ్య.. అండమాన్ సమీపంలో కూలిన ‘స్కైలాబ్’
IAS Srilakshmi | ఒక్క పదం తొలగించినందుకు నిత్య నరకం.. ఐఏఎస్‌లకు ఈమె కేసు పెద్ద గుణపాఠం!
eggs found in volcano | వేల గుడ్లను పొదుగుతున్న అగ్నిపర్వతం? ఎక్కడ.. ఆ కథేంటి?
Life on Mars | అంగారకుడిపై ఒకప్పుడు నదీ వ్యవస్థలు, సరస్సులు!.. భూమిలాంటి వాతావరణం?