లైంగిక వేధింపులకు గురిచేయడంతోపాటు చంపుతానని బెదిరించిన వ్యవహారంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు కాంగ్రెస్ నేత కుంభం శివకుమార్‌రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్నికరెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రి వాకిటి శ్రీహరి, నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు చిట్టెం అభిజయ్‌రెడ్డిలై చర్యలు తీసుకోవాలని కోరుతూ శ్రీలత అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్ ను నాంపల్లి కోర్టు రిటర్న్ చేసింది. శుక్రవారం ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు…పిటిషన్ తమ పరిధిలోకి రాదని, ప్రజాప్రతినిధులను కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది.
ఈ కేసు విషయాన్ని మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెైస్ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్ వేసిన నామినేషన్ పత్రాలలో పేర్కొనలేదంటూ ఆర్వో ఆమె నామినేషన్ తిరస్కరించిన సంగతి తెలిసిందే.
