ఆపరేషన్ కమల్’ ప్రారంభం కావొచ్చు…బీజేపీ భాగస్వామ్యపక్షాలు జాగ్రత్త !
కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ, జేడీయూల మద్దతే కీలకం అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఎన్డీఏలోని భాగస్వామ్యపార్టీలైన టీడీపీ, జేడీయూలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
- కాషాయపార్టీ ‘ఆపరేషన్ కమల్’ ప్రారంభం కావొచ్చు
- ఆ రెండు పార్టీలు అప్రమత్తగా ఉండాలన్న ఒమర్ అబ్దుల్లా
కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ, జేడీయూల మద్దతే కీలకం అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఎన్డీఏలోని భాగస్వామ్యపార్టీలైన టీడీపీ, జేడీయూలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
‘బీజేపీ ఈ రెండు పార్టీల మద్దతు అవసరం లేకుండానే కేంద్రంలో సర్కారును నడిపే సొంత బలం కోసం బీజేపీ యత్నించవచ్చని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. అందువల్ల ఈ రెండు పార్టీలూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం ఏన్డీఏలో కీలక భాగస్వాములుగా ఉన్న జేడీయూ, టీడీపీలపై మున్ముందు ఆధారపడే పరిస్థితి రాకుండా ‘ఆపరేషన్ కమల్’ బీజేపీ ప్రారంభించే రోజు ఎంతో దూరం లేదన్నారు. ఆలోగానే ఈ పార్టీలు అప్రమత్తం కావాలన్నారు.’ పీటీఐకి ఇచ్చి ఇంటర్వ్యూలో ఒమర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఒమర్ అబ్దుల్లానే కాదు బీజేపీ బాధిత ప్రాంతీయపార్టీలైన శివసేన (యూబీటీ), ఎన్సీపీ( శరద్‌పవార్) నేతలు ఇదే విధంగా స్పందిస్తున్నారు. శివనేన నేత ఆదిత్య ఠాక్రే అయితే స్పీకర్ పదవిని టీడీపీ లేదా జేడీయూనే చేక్కించుకోవాలని సూచించారు. ఒకవేళ బీజేపీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ప్రయత్నం చేసినా అడ్డుకొనే అవకాశం ఉంటుందనేది ఆయన అభిప్రాయం. పదేళ్ల కాలంలో ప్రాంతీయపార్టీల పట్ల, ఎన్డీఏ భాగస్వామ్యపార్టీల పట్ల బీజేపీ అనుసరించిన విధానాలే ప్రస్తుత భయాలకు కారణం. తాజాగా మంత్రివర్గ కూర్పులోనూ బీజేపీ కీలక శాఖలన్నీ తనవద్దే ఉంచుకున్నది. ఒకవైపు సంకీర్ణ ధర్మం పాటిస్తామని, సమిష్టి నిర్ణయాలు తీసుకుంటామంటూనే తన మార్క్‌ను చూపెడుతున్నది. మోడీ దాదాపు పదిహేనేళ్లు సీఎంగా, పదేళ్లు పీఎంగా స్పష్టమైన మెజారిటీ తోనే పనిచేశారు. అందుకే ఆయన నిర్ణయాలన్నీ ఏకపక్షంగా ఉన్నాయనే విమర్శలున్నాయి. ఇప్పుడు భాగస్వామ్యపక్షాల సూచనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలం లేకపోవడంతో గతంలో మాదిరిగా సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బీజేపీ తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని సమీక్షించాల్సిందేనని జేడీయూ, ఎల్జేపీ (రాం విలాస్ పాశ్వాన్) వంటి పార్టీలు అప్పుడే వాదనలు మొదలుపె%B
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram