నేపాల్‌ వరదల్లో 105 మంది భారతీయులు గల్లంతు!

నేపాల్‌లోని రసువా జిల్లాలో సంభవించిన ఆకస్మిక వరదల్లో 105 మంది భారతీయులు గల్లంతయ్యారు. మొత్తం 291 మంది విదేశీయులు, 93 మంది నేపాలీలు అదృశ్యమైనట్లు నేపాల్ టూరిజం బోర్డు తెలిపింది.

నేపాల్ లో సంభవించిన ఆకస్మిక వరదలలో 105 మంది భారతీయులు గల్లంతయ్యారు. రసువా ప్రాంతంలో బుధవారం మెరుపు వరదలు సంభవించాయి. వరదల ఉదృతిలో ఇప్పటివరకు 291 మంది విదేశీయులు, 93 మంది నేపాలీలు గల్లంతైనట్లు నేపాల్‌ టూరిజం బోర్డు వెల్లడించింది. వీరిలో 105 మంది భారతీయులు ఉన్నట్లు నేపాల్‌ తెలిపింది. టిబెట్‌ వైపు నుంచి ఉద్భవించే భోటెకోశీ నదిలో ఈ రోజు ఉదయం ప్రవాహం ఆకస్మికంగా పెరగడంతో పలు గ్రామాలు కొట్టుకుపోయాయి. రసువా జిల్లాలోని టిమురే, స్యాఫ్రుబేసిని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి.

భారీ వరదల ప్రభావిత ప్రాంతాల నుంచి భయానక దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.హైడ్రో ఎలక్ట్రానిక్ ఫ్లాంట్ తో పాటు అనేక వంతెనలు, ఇళ్లు కొట్టుకపోయాయి. నేపాల్ సైన్యం సహాయక చర్యలు చేపట్టింది. టిబెట్ లో మంచుకొండలు కూలడంతో ఈ వరదలు సంభవించినట్లుగా గుర్తించారు. నేపాల్ వరదల నేపథ్యంలో సరిహద్దు జిల్లాల ప్రజలను అప్రమత్తం చేశారు.

Latest News