మధ్యప్రదేశ్ రాజ్ గఢ్ లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరద ఉదృతితో ప్రవాహిస్తున్న ఓ కాలువలో ప్రయాణికుల వ్యాన్ కొట్టుకపోయిన ప్రమాదంలో 9 మంది మరణించారు. ప్రమాద సమయంలో వ్యాన్ లో 11 మంది ప్రయాణికులు ఉన్నారు.
రాజ్‌గఢ్‌లో పచోర్-సారంగ్‌పూర్ రోడ్డులోని పద్దనా పట్టణం వద్ద నిర్మాణంలో ఉన్న వంతెనపై నుంచి ‘ఈకో’ (Eco) వ్యాన్ కాలువలో పడి కొట్టుకుపోయింది. ఇందులో మొత్తం 11 మంది ప్రయాణిస్తున్నారు. భారీ వర్షం కారణంగా వంతెన పైనుంచి నీరు ప్రవహిస్తోంది. అసంపూర్తిగా ఉన్న వంతెనను కారు డ్రైవర్ గమనించలేదు. అయోమయంలో అతను కారును వంతెనపైకి నడపడంతో, అది కాలువలోకి కొట్టుకుపోయింది. ఇద్దరు వ్యక్తులు ఈదుకుంటూ బయటపడగా, మిగిలిన వారు వాహనంలోనే చిక్కుకుపోయారు.
ఇప్పటివరకు 5 మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన వారి కోసం రక్షణ బృందాలు గాలిస్తున్నాయి. ఆ వాహనంలోని వారందరూ దేవాస్ నివాసితులు. వారు సత్వాస్ నుండి కడ్లావాడ్ గ్రామానికి వెళ్తున్నారు. వారిలో ముగ్గురు పురుషులు, నలుగురు మహిళలు, నలుగురు పిల్లలు ఉన్నారు.
राजगढ़ में ईको वैन पुल से नाले में बह गई। इसमें कुल 11 लोग सवार थे। अब तक 5 शव बरामद किए जा चुके
राजगढ़,जिले में निर्माणाधीन पुल के कारण एक इको कार डूबी
-11 लोग सवार थे, 2 लोगों के ही निकलने की सूचना, बाकि लापता, तलाश जारी
राजगढ़ में ईको वैन पुल से नाले में बह गई। इसमें कुल 11… pic.twitter.com/4tK40xSw2V
— sunita dhangar (@dhangarranglal2) August 10, 2026
