Child bites a Cobra | వామ్మో… నాగుపామును ప‌ళ్ల‌తో కొరికి చంపిన ఏడాది బాలుడు

Child bites a Cobra | ఓ పిల్లాడు ఏకంగా నాగుపాము( King Cobra )ను కొరికి చంపాడు. అంత‌టితో ఆగ‌లేదు.. దాన్ని రెండు ముక్క‌లుగా చేశాడు. మ‌రి ఆ బాలుడు( One Year Child ) మాత్రం ప్రాణాలతో బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డాడు.

  • By: raj |    national |    Published on : Jul 27, 2025 10:02 AM IST
Child bites a Cobra | వామ్మో… నాగుపామును ప‌ళ్ల‌తో కొరికి చంపిన ఏడాది బాలుడు

Child bites a Cobra | నాగుపాము( Kong Cobra ) పేరు వింటేనే గుండెల్లో దడ పుడుతుంది. మ‌రి అది ప్ర‌త్య‌క్షంగా క‌నిపిస్తే.. ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని.. అక్క‌డ్నుంచి నిష్క్ర‌మించేందుకు య‌త్నిస్తాం. కానీ ఓ ఏడాది బాలుడు( One Year Child ) మాత్రం.. త‌న ముందున్న నాగుపాముకు ఏ మాత్రం భ‌య‌ప‌డ‌కుండా.. దాన్ని త‌న చేతుల్లోకి తీసుకుని ప‌ళ్ల‌తో కొరికి చంపాడు. ఈ అతి భయంక‌ర‌మైన ఘ‌ట‌న బీహార్‌( Bihar )లోని వెస్ట్ చంపార‌న్( West Champaran ) జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌జ‌హ‌లియా బ్లాక్ ప‌రిధిలోని మొహ‌చ్చి బంక‌త్వా గ్రామంలోని ఓ ఇంట్లోకి నాగుపాము( King Cobra ) ప్ర‌వేశించింది. అదే ఇంట్లో ఉంటున్న ఏడాది బాలుడు( One Year Child ) ముందు ఆ పాము ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక బాలుడు దాన్ని ఆట‌బొమ్మ‌( Toy )గా భావించి త‌న చేతుల్లోకి తీసుకున్నాడు. ఇంకేముంది అల‌వాటులో భాగంగా.. ఆ పామును బొమ్మ అనుకుని ప‌ళ్ల‌తో కొరికేశాడు. దెబ్బ‌కు ఆ నాగుపాము ప్రాణాలు విడిచింది.

అప్ర‌మ‌త్త‌మైన కుటుంబ స‌భ్యులు పిల్లాడిని మ‌జ‌హ‌లియా ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రానికి త‌ర‌లించారు. అప‌స్మార‌క‌స్థితిలో ఉన్న బాబుకు ప్ర‌థ‌మ చికిత్స అందించి.. మెరుగైన చికిత్స నిమిత్తం బెత్త‌య్య‌లోని గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజీ ఆస్ప‌త్రి( GMHC )కి త‌ర‌లించారు.

ఈ సంద‌ర్భంగా పిల్లాడి తండ్రి మాట్లాడుతూ.. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం త‌మ ఇంట్లోకి నాగుపాము ప్ర‌వేశించింద‌ని, అది రెండు ఫీట్ల పొడ‌వు ఉన్న‌ట్లు తెలిపాడు. ఆ స‌మ‌యంలో త‌మ బిడ్డ‌తో పాటు నాన‌మ్మ మాతేశ్వ‌రి మాత్ర‌మే ఉన్న‌ట్లు పేర్కొన్నాడు. బొమ్మ అనుకుని పామును ప‌ట్టుకుని కొరికేసిన‌ట్లు చెప్పాడు. వెంట‌నే నాగుపాము చ‌నిపోయింది. మొత్తానికి నాగుపామును రెండు ముక్క‌లు చేసిన‌ట్లు పేర్కొన్నాడు.

జీఎంసీహెచ్ హాస్పిట‌ల్ డిప్యూటీ సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ దివాకాంత్ మిశ్రా మాట్లాడుతూ.. బాలుడిలో ఎలాంటి పాయిజ‌న్ ల‌క్ష‌ణాలు లేవ‌న్నారు. ప్ర‌స్తుతం అయితే బాలుడికి చికిత్స కొన‌సాగుతుంది. అత‌నికి ఎలాంటి ప్ర‌మాదం లేద‌న్నారు.

ఇవి కూడా చదవండి..

Deaths by drowning | 9 వేల మంది జ‌ల స‌మాధి.. అత్య‌ధికులు నాలుగేండ్ల లోపు వారే..
Banakacharla | ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఉచిత పథకాలకంటే డేంజర్‌.. బనకచర్ల!
Polavaram A water Bomb? | కాళేశ్వరం తరహాలో పోలవరానికి సీపేజ్‌ రూపంలో పెను ముప్పు?
Polavaram A water Bomb? | కాళేశ్వరం తరహాలో పోలవరానికి సీపేజ్‌ రూపంలో పెను ముప్పు?