Indian Army | పాక్ యుద్ధ విమానాలను నేలమట్టం చేసిన భారత సైన్యం..
Indian Army | డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలతో దాడికి పాకిస్తాన్( Pakistan ) చేసిన ప్రయత్నాన్ని భారత సైన్యం( Indian Army ) సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఆరు యుద్ధ విమానాలు, 8 క్షిపణులు, డ్రోన్లను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసి.. పాక్‌కు గట్టి బుద్ధి చెప్పింది.

Indian Army | న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడి( Pahalgam Terror Attack )కి ప్రతీకారంగా పాకిస్తాన్( Pakistan ), పాక్ ఆక్రమిత కశ్మీర్( PoK )లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం( Indian Army ) మెరుపు దాడులు చేసి నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ – పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక గురువారం రాత్రి భారత సైనిక శిబిరాలు, జమ్మూ ఎయిర్‌పోర్టు( Jammu Airport ), పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్( Pathankot Airbase ) లక్ష్యంగా పాకిస్తాన్ దాడులకు తెగబడింది. డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలతో దాడికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాన్ని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఆరు యుద్ధ విమానాలు, 8 క్షిపణులు, డ్రోన్లను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసి.. పాక్‌కు గట్టి బుద్ధి చెప్పింది. ఒక పాకిస్తాన్ పైలట్( Pakistan Pilot )ను కూడా భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. ఇక భారత్ వైపు ఎలాంటి నష్టం జరగలేదని రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించింది.
సరిహద్దు రాష్ట్రాలైన జమ్ముకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్‌లో దాడులు చేసేందుకు పాకిస్తాన్ విఫలయత్నం చేసింది. జమ్ము ఎయిర్‌పోర్టుతోపాటు సరిహద్దుల్లోని పలు సైనిక కేంద్రాలను టార్గెట్‌గా చేసుకుంది. దాదాపు 35 నిమిషాల పాటు పాక్ చేసిన దాడులను భారత్ బలగాలు అత్యంత సమర్థంగా తిప్పికొట్టాయి. జమ్ము, ఉధంపుర్, అఖ్నూర్, పూంఛ్, రాజస్థాన్‌లోని జైసల్మేర్, పోఖ్రాన్, పంజాబ్‌లోని పఠాన్‌కోట్, జలంధర్ లక్ష్యంగా పాక్ డ్రోన్లు ప్రయోగించింది. సత్వారా, సాంబా, ఆర్‌ఎస్ పురాల్లో క్షిపణి దాడులకు పాకిస్థాన్ ప్రయత్నించింది. పోఖ్రాన్ ఆర్మీ స్టేషన్‌పై డ్రోన్ల దాడికి పాక్ యత్నించగా భారత్ అడ్డుకుంది.
3 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత్..
పాకిస్థాన్‌కు చెందిన ఒక ఎఫ్-16, రెండు జేఎఫ్-17 సహా 6 యుద్ధ విమానాలను భారత సైన్యం కూల్చేసింది. ఎఫ్-16 పైలట్ మన సైన్యానికి చిక్కాడు. అఖ్నూర్‌లో ఎస్-400 రక్షణ వ్యవస్థ F-16 విమానాన్ని కూల్చేసింది. జమ్ము యూనివర్సిటీకి సమీపంలో 2 పాక్ డ్రోన్లను భారత్ ధ్వంసంచేసింది. పాకిస్తాన్ దాడులు చేసిన సమయంలో రాజస్థాన్‌లోని బికనీర్, పంజాబ్‌లోని జలంధర్‌లో బ్లాక్ అవుట్ విధించారు. కిస్త్వార్, అఖ్నూర్, సాంబా, జమ్ము, అమృత్ సర్, జలంధర్ లలోనూ బ్లాక్ అవుట్ అమలు చేశారు. శ్రీనగర్, రాజౌరీలోనూ అదే పరిస్థితి నెలకొంది. ఆ ప్రాంతాల్లో అధికారులు పూర్తిగా విద్యుత్ సరఫరాను నిలిపేశారు.