రాహుల్ ఆధ్యాత్మిక యాత్ర.. కేదార్‌నాథ్ ఆలయంలో పూజలు

రాహుల్ ఆధ్యాత్మిక యాత్ర.. కేదార్‌నాథ్ ఆలయంలో పూజలు

విధాత‌: కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారానికి కాస్త‌ బ్రేక్ ఇచ్చారు. ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయంలో ఆదివారం పూజలు చేశారు. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరాం రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ వ‌య‌నాడ్ ఎంపీ రాహుల్‌ గాంధీ కాస్త విరామం తీసుకున్నారు.


ప్రైవేట్ హెలికాప్టర్ ద్వారారాహుల్ గాంధీ కేదార్‌నాథ్‌ పుణ్యక్షేత్రానికి వెళ్లారు. అక్క‌డ ఆయ‌న‌కు ఆలయ అర్చకులు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు స్వాగతం పలికారు. అనంత‌రం రాహుల్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. భారతదేశంలోని శివునికి అంకితం చేసిన 12 జ్యోతిర్లింగాలలో కేదార్‌నాథ్ ఆలయం కూడా ఒకటి.



తన కేదార్‌నాథ్ యాత్ర విశేషాల‌ను రాహుల్ గాంధీ ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు. తన పర్యటన చిత్రాలను పోస్ట్ చేశారు. “ఈ రోజు, నేను ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ధామ్‌ని సందర్శించారు. స్వామివారి దర్శనం అనంత‌రం పూజలు చేశాను. హర్ హర్ మహాదేవ్” అని పేర్కొన్నారు. కేదార్‌నాథ్ వద్ద ఆశీర్వాదం తీసుకున్న తర్వాత రాహుల్ గాంధీ.. తన ఎన్నికల ప్రచారాన్ని తిరిగి ప్రారంభించారు. సోమ‌వారం ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.