Sama Ram Mohan Reddy : కిషన్ రెడ్డి ఒక బ్రోకర్..కిరికిరి రెడ్డి

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బ్రోకర్ లా ప్రవర్తిస్తున్నారని, తెలంగాణ అభివృద్ధికి అడ్డు పడుతున్నారని టీపీసీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి విమర్శించారు.

Sama Ram Mohan Reddy : కిషన్ రెడ్డి ఒక బ్రోకర్..కిరికిరి రెడ్డి

విధాత, హైదరాబాదా్ : కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఒక బ్రోకర్ గా..కిరికిరి రెడ్డిగా మారారు అని టీపీసీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై కిషన్ రెడ్డి అర్ధరహితమైన విమర్శలు చేస్తూ..రాష్ట్రాన్ని అభివృద్ది కాకుండా కాళ్ళల్లో కట్టెలు పెడుతున్నాడని సామా విమర్శించారు. కేటీఆర్ మాట్లాడే చిట్టి(స్లిప్) లను చూసి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని..కేటీఆర్ చెప్పిందే కాపీ పెస్ట్ చేసి కిషన్ రెడ్డి చెబుతున్నాడని, ఒకటే స్క్రిప్ట్ ను కేటీఆర్, కిషన్ రెడ్డి జిరాక్స్ చేసి చదువుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి కిషన్ రెడ్డి తెచ్చింది ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు.

హైదరాబాద్ పరిరక్షణకే హిల్ట్ పాలసీ

ఢిల్లీలో కాలుష్యం ప్రబలిపోయి.. గాలిని కొనుక్కొని బతికే పరిస్థితి వచ్చిందని, హైదారాబాద్ కు అలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం తెచ్చిన హిల్ట్ పాలసీని తప్పుబడుతున్న కిషన్ రెడ్డి..హైదరాబాద్ ను కూడా ఢిల్లీగా మార్చాలనిప్రయత్నం చేస్తున్నారా? అని సామా నిలదీశారు. కిషన్ రెడ్డి గాలికి మాట్లాడతా అంటే ఒప్పుకునేది లేదు అన్నారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి చిట్టిలు అందించేది ఎవరో తెలియదా? అని విమర్శించారు. హిల్ట్ పాలసీ కింద ఉన్నవి ప్రయివేట్ భూములు అని, ప్రయివేట్ ఓనర్ల నిరుపయోగమైన భూములపై వాలంటరీగా వెసులుబాటు ఇస్తే కేటీఆర్ కి నొప్పి ఏంటి? అని ప్రశ్నించారు. హిల్ట్ పాలసీలో ప్రభుత్వ భూమి లేదు అని సామా స్పష్టం చేశారు.

దేవాలయాలపై జీఎస్టీ వేస్తే బీజేపీ నాయకులు మౌనంగా ఉంటారా? అని, తెలంగాణ దేవాయాలపై వేసిన జీఎస్టీ తగ్గించే దాకా పోరాడడానికి కిషన్ రెడ్డి వస్తాడా? అని సామా ప్రశ్నించారు. బీజేపీ నాయకులకు నరేంద్ర మోదీ ఒక్కడే దేవుడు అని, నిజమైన హిందువులకు ముక్కోటి దేవుళ్ళు ఉన్నారని..అదే విషయం రేవంత్ రెడ్డి చెప్పారన్నారు.