రైల్వేకు రూ. 30,000 జరిమానా.. ప్లాట్‌ఫారం బయట రైలు నిలిపివేత
ప్లాట్‌ఫారం బయట రైలు నిలిపివేయడంతో చెన్నైకి చెందిన ఒక వృద్ధుడు పట్టాలపై దిగాల్సి వచ్చింది. దాంతో కిందపడి గాయపడ్డారు. దీనిపై ఆయన వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కు ఫిర్యాదుచేయడంతో భారత రైల్వేకు రూ.30 వేల జరిమానా విధించింది.

పట్టాలపైకి దిగి కిందపడ్డ వృద్ధుడు
వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు
ఫైన్ విధించిన పరిష్కార కమిషన్
విధాత: ప్లాట్‌ఫారం బయట రైలు నిలిపివేయడంతో చెన్నైకి చెందిన ఒక వృద్ధుడు పట్టాలపై దిగాల్సి వచ్చింది. దాంతో కిందపడి గాయపడ్డారు. దీనిపై ఆయన వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కు ఫిర్యాదుచేయడంతో భారత రైల్వేకు రూ.30 వేల జరిమానా విధించింది.
అసలు ఏమి జరిగిందంటే.. చెన్నైఅగరానికి చెందిన కేవీ రమేశ్ అనే వృద్ధుడు నవజీవన్ సూపర్-ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో రెండో A/C కోచ్‌లో అంకాలేశ్వర్‌కు టికెట్ తీసుకున్నారు. కంపార్ట్‌మెంట్‌తోపాటు మరో మూడు ఏసీ కోచ్‌లు ప్లాట్‌ఫారమ్ వెలుపల ఆగిపోవడంతో తాను కిందకు దిగలేక దూకేందుకు ప్రయత్నించి గాయపడ్డారు. దీనిపై ఆయన చెన్నై (ఉత్తర) జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
విచారణ జరిపిన కమిషన్ సేవలో లోపానికి సంబంధించి ఫిర్యాదుదారుడికి రూ.25,000, వ్యాజ్య ఖర్చుల కింద మరో రూ.5,000 రైల్వేశాఖ చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. కాగా, ఈ సంఘటన జరిగిన 10 నెలల తర్వాత.. అక్టోబర్ 2022లో అంక్లేశ్వర్ వద్ద ప్లాట్‌ఫారమ్ పొడిగింపు పూర్తయిందని రైల్వే తెలిపింది.