silver all time high| దూసుకపోతున్న వెండి ధర..ఒక్క రోజునే రూ. 12వేల పెంపు
బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. మంగళవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,040పెరిగి రూ.1లక్ష 47,280కి చేరింది. కిలో వెండి ధర మంగళవారం ఒక్క రోజునే రూ.12,000పెరిగి రూ.3,30,000కు చేరి ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది.
విధాత: బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. మంగళవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,040పెరిగి రూ.1లక్ష 47,280కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.950పెరిగి రూ.1,35,000కు పెరిగింది.
వెండి ధరల ఫైరింగ్
వెండి ధరలు మరోసారి ఆల్ టైమ్ రికార్డు ధరలను నమోదు చేశాయి. కిలో వెండి ధర మంగళవారం ఒక్క రోజునే రూ.12,000పెరిగి రూ.3,30,000కు చేరింది. జనవరి 1న కిలో వెండి ధర రూ.2,56,000 ఉండగా..నేడు రూ.3లక్షల 30వేలకు చేరడం గమనార్హం. 2025జూలై 1వ తేదీన వెండి కిలో ధర రూ.1లక్ష 20వేలుగా ఉన్న తీరు చూస్తే కొన్ని నెలల వ్యవధిలోనే ఇంత భారీ పెరుగుదలను నమోదు చేయడం గమనార్హం. వెండి ధర త్వరలోనే రూ.3.50లక్షల మార్కుకు, బంగారం ధర రూ.1లక్ష 50వేల మార్కు చేరుకోనుందని ఇప్పటికే మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. అంతర్జాతీయ పరిణామలు, గ్రీన్ ల్యాండ్ వివాదం వెండి, బంగారం ధరల పెరుగుదలకు కారణమైనట్లుగా భావిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram