Rakhi Sawant | ఆస్పత్రి పాలైన రాఖీ సావంత్..! గుండె పోటే కారణమా..?
Rakhi Sawant | రాఖీ సావంత్ ఆమె పేరు తెలియని వారు ఉండరు. కామెడీతో అందర్నీ నవ్విస్తూ యువత గుండెల్లో స్థానం సంపాదించుకుంది. వివాదాలతో అప్పుడప్పుడు వార్తల్లో కూడా నిలుస్తూ అందరి నోట్లో మెదులుతుంది రాఖీ సావంత్. అలా ఎప్పుడు వినోదాన్ని పంచుతూ, వార్తల్లో నిలిచే రాఖీ సావంత్ హాస్పిటల్ పాలైంది.
Rakhi Sawant | ముంబై : రాఖీ సావంత్ ఆమె పేరు తెలియని వారు ఉండరు. కామెడీతో అందర్నీ నవ్విస్తూ యువత గుండెల్లో స్థానం సంపాదించుకుంది. వివాదాలతో అప్పుడప్పుడు వార్తల్లో కూడా నిలుస్తూ అందరి నోట్లో మెదులుతుంది రాఖీ సావంత్. అలా ఎప్పుడు వినోదాన్ని పంచుతూ, వార్తల్లో నిలిచే రాఖీ సావంత్ హాస్పిటల్ పాలైంది. దీంతో ఆమె అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.
తీవ్రమైన గుండె జబ్బుతో రాఖీ సావంత్ ముంబైలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరారు. ఆమె బెడ్‌పై పడుకుని ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక వేలికి ఆక్సిమీటర్, మరొక చేతికి వైగో జోడించి ఉంది. గ్లూకోజ్ బాటిల్ కూడా ఎక్కిస్తున్నారు. రాఖీ సావంత్‌కు నర్సు బీపీ చెక్ చేస్తున్న ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలు చూసి రాఖీ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆమె వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. తన మాజీ భర్త రితేశ్‌తో కలిసి ఇటీవలే కనిపించింది రాఖీ. 2024 మెట్ గాలా ఈవెంట్‌లో రెడ్ కలర్ టవల్ డ్రెస్ ధరించి హాజరయ్యారు. రితేశ్ తర్వాత ఆదిల్ ఖాన్‌ను రాఖీ పెళ్లాడింది. ఆదిల్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని అతనిపై కేసులు పెట్టింది రాఖీ. దీంతో అతన్ని ఫిబ్రవరి 7న అరెస్టు చేశారు. ఐదు నెలల తర్వాత బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు ఆదిల్.
View this post on Instagram
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram