విధాత : అభయారణ్యంలో సందర్శకుల వ్యవహారం రానురాను శ్రుతిమించుతుంది. అటవీ శాఖ అధికారులు ఆదాయం కోసం అభయారణ్యంలో సందర్శకులను అనుమతిస్తున్నారు. అయితే సఫారీ వాహనాల్లో అడవిలోకి వెలుతున్న సందర్శకుల అతి ప్రవర్తన వన్యప్రాణుల సహజ జీవన శైలికి అంతరాయం కల్గిస్తున్న ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి.
తాజాగా రణతంబోర్ టైగర్ రిజర్వ్ జోన్-3లో రెండు పులులు ఒక జింకను వేటాడిన అరుదైన దృశ్యం వీడియో వైరల్ అయ్యింది. అయితే అదే సమయంలో సందర్శకులతో కూడిన వన్యప్రాణి సఫారీ వాహనాలు అటుగా వచ్చాయి. అందులోని డ్రైవర్, గైడ్ అవసరం లేకున్నా అరవడం, గట్టిగా శబ్దాలు చేయడం పులుల వేట ప్రక్రియను ఆటంక పరిచేదిగా కనిపించింది. “ఒక్క ఫోటో కూడా రాలేదు, వాహనం పక్కకు తీసుకెళ్లండి” వంటి వారి వ్యాఖ్యలు అడవిలోని ప్రశాంత వాతావరణాన్ని, జంతువుల జీవన ప్రక్రియను భగ్నం చేసేదిగా ఉన్నాయన్న విమర్శలకు తావిచ్చింది. వారి కేకలు, శబ్దాలతో ఓ పులి వెంటనే వేటాడిన జింక దేహంతో అడవిలోకి వెళ్లిపోయాయి. ఆ సమయంలో అక్కడ మూడు పెద్ద పులులు ఉండటం వీడియోలో కనిపించింది.
వన్యప్రాణి సఫారీలు త్వరితగతిన ఫోటోల కోసం చేసే శబ్దానికి కాకుండా, నిశ్శబ్దానికి, సహనానికి, ప్రకృతి సహజ వాతావరణనాన్ని పరిరక్షించేలా కొనసాగించడంలో అధికారులు శ్రద్ద వహించాలని వన్యప్రాణి ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. గైడ్ లు, డ్రైవర్లు బాధ్యతతో వ్యవహరించి జంతువుల సహజ జీవన ప్రక్రియకు ఇబ్బంది లేకుండా సఫారీ రైడ్స్ నిర్వహించాలని సూచిస్తున్నారు.
Today a video gose viral in that two Tigers killed a deer at Ranthambore Zone-3 an intense and rare wildlife moment. 🐯
But what’s worrying is the unnecessary shouting and noise by the driver and guide, seemingly just to push for tips. Comments like “ek bhi photo nahi aayi,… pic.twitter.com/i4yO7DaS9z— Creature of Wildlife (@wildlife_clicks) April 8, 2026
ఇవి కూడా చదవండి :
Typing Test | ‘టైప్’లో విఫలం.. అటెండర్లుగా మారిన ముగ్గురు క్లర్క్‌లు
Student Suicide | తల్లి మందలించిందని.. ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్య
