Student Suicide | తల్లి మందలించిందని.. ఆరో తరగతి విద్యార్థి ఆత్మహ‘త్య
Student Suicide | తల్లి మందలించిందని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసింది.
Student Suicide | తల్లి మందలించిందని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఆత్మహ‘త్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. పాల్వంచ పరిధిలోని వెంగళ్రావు కాలనీకి చెందిన భూక్యా మహేందర్(12) డీఏవీ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్నాడు. అయితే అతను బుధవారం తన స్నేహితులతో గొడవపడ్డాడు. దీంతో తల్లి మహేందర్‌ను మందలించింది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన మహేందర్.. బుధవారం అర్ధరాత్రి తన ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు.
కుమారుడు ఫ్యాన్‌కు వేలాడుతున్న దృశ్యాన్ని తల్లిదండ్రులు షాకయ్యారు. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పాల్వంచ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram