Noel Tata | టాటా గ్రూప్స్‌ సంస్థల చైర్మన్‌గా నోయల్‌ టాటా.. ఏకగ్రీవంగా ఎన్నుకున్న బోర్డు

టాటా గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ (Tata Group companies)గా నోయల్‌ టాటా (Noel Tata) బాధ్యతలు చేపట్టనున్నారు. చైర్మన్‌గా ఆయనను బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Noel Tata | టాటా గ్రూప్స్‌ సంస్థల చైర్మన్‌గా నోయల్‌ టాటా.. ఏకగ్రీవంగా ఎన్నుకున్న బోర్డు

Noel Tata | టాటా గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ (Tata Group companies)గా నోయల్‌ టాటా (Noel Tata) బాధ్యతలు చేపట్టనున్నారు. చైర్మన్‌గా ఆయనను బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పటి వరకు టాటా సంస్థల చైర్మన్‌గా రతన్‌ టాటా (Ratan Tata) కొనసాగగా.. బుధవారం అర్ధరాత్రి ఆయన ఆరోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో నోయల్‌ బాధ్యత స్వీకరించనున్నారు.

ప్రస్తుతం నోయల్‌ టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్, వోల్టాస్ లిమిటెడ్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ తదితర టాటా గ్రూప్ కంపెనీలకు చైర్మన్‌గా కొనసాగుతున్నారు. అలాగే, టైటాన్‌ కంపెనీ వైస్‌ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. వాస్తవానికి టాటా గ్రూప్‌ హోల్డింగ్‌కంపెనీ అయిన టాటా ట్రస్ట్‌కే మెజారిటీ వాటా 66శాతం ఉంది. దాంతో టాటా ట్రస్ట్‌ చైర్మన్‌ హోదాలో ఉన్న వ్యక్తి.. గ్రూప్‌ కార్యకలాపాలు, వృద్ధి నిర్ణయాల్లో కీలకపాత్ర పోస్తుంటారు. ఇప్పటి వరకు టాటా ట్రస్ట్‌ చైర్మన్‌గా రతన్‌ టాటా కొనసాగారు. ఆయన మరణంతో చైర్మన్‌ పదవి ఖాళీ కాగా.. నోయల్‌ టాటాను బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

నోయల్‌ టాటా.. రతన్‌ టాటా సవతి తల్లి కుమారుడు. ఇక నోయల్‌ భార్య ఆలూ మిస్త్రీ పల్లోంజి మిస్త్రీ కూతురు. ఆమె సోదరుడే టాటా సన్స్‌ మాజీ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ. పల్లోంజి మిస్త్రీకి టాటా గ్రూప్‌లోనూ 18.4శాతం ఉన్నది. నోయల్‌ – ఆలూ దంపతులకు లేహ, నేవిల్లే, మాయా ముగ్గురు సంతానం ఉన్నారు. వీరు ఇప్పటికే టాటా గ్రూప్‌లో పలు పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు