Ratan Tata | మానవతావాది రతన్ టాటా.. ఆయన లేని లోటు తీరనిది : కేసీఆర్
Ratan Tata | టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) మృతిపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (K Chandrashekar Rao) సంతాపం ప్రకటించారు. ఆయన ఆర్థిక ప్రగతికి, మానవత్వానికి అద్దిన అరుదైన పారిశ్రామికవేత్త అని కొనియాడారు. సమాజ హితుడుగా వారి తాత్వికత, దార్శనిక కార్యాచరణ ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు.
Ratan Tata | టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) మృతిపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (K Chandrashekar Rao) సంతాపం ప్రకటించారు. ఆయన ఆర్థిక ప్రగతికి, మానవత్వానికి అద్దిన అరుదైన పారిశ్రామికవేత్త అని కొనియాడారు. సమాజ హితుడుగా వారి తాత్వికత, దార్శనిక కార్యాచరణ ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. అభివృద్ధి ఫలాలు కింది స్థాయికి చేరుకోవాలనే సామాజిక ఆర్థిక తాత్వికతను సొంతం చేసుకున్న అరుదైన పారిశ్రామిక వేత్త రతన్ టాటా అని కేసీఆర్ తెలిపారు. సమాజ సంక్షేమం కోసం, రేపటి తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం జీవితకాలం తపించిన రతన్ టాటా ఆదర్శాలు, కార్యాచరణ ప్రపంచ ఆర్థిక పారిశ్రామిక రంగానికి దిక్సూచిగా నిలవాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఒక కార్యక్రమానికి హాజరై.. నూతన తెలంగాణ రాష్ట్రం అనతికాలంలో సాధిస్తున్న అభివృద్ధిని అభినందించడం, సాంకేతిక పారిశ్రామిక రంగాల్లో నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన దార్శనిక కార్యాచరణపై ఆయన ఆనందాన్ని వ్యక్తం చేయడం తెలంగాణ కు గర్వకారణమని కేసీఆర్ స్మరించుకున్నారు. మానవతావాది రతన్ టాటా మృతి భారత పారిశ్రామిక రంగానికే కాకుండా సమాజ సంక్షేమాన్ని ప్రగతిని కాంక్షించే ప్రతి ఒక్కరికీ తీరని లోటని కేసీఆర్ అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram