రోడ్డు ప్రమాదంలో..రూ.16 కోట్ల బంగారం పట్టివేత!

పోలీస్ వాహనాన్ని కారు ఢీ కొట్టిన ప్రమాదంలో రూ.16కోట్ల బంగారం పట్టుబడటం కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లా తాల్‌గ్రామ్ పరిధిలో ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై పోలీసుల వాహనాన్ని బ్రెజా కారు ఢీకొట్టిన ఘటనలో అక్రమంగా రవాణా చేస్తున్న బంగారం పట్టుబడింది.

విధాత: పోలీస్ వాహనాన్ని కారు ఢీ కొట్టిన ప్రమాదంలో రూ.16కోట్ల బంగారం పట్టుబడటం కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లా తాల్‌గ్రామ్ పరిధిలో ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై పోలీసుల వాహనాన్ని బ్రెజా కారు ఢీకొట్టింది. ఘటన తర్వాత కారులోని నేపాల్‌కు చెందిన ఒక వ్యక్తితో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారును తనిఖీ చేయగా స్మగ్లింగ్ బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కారులో 10 బంగారు బిస్కెట్లు లభించాయి. వాటి బరువు సుమారు 10.26 నుంచి 10.37 కిలోలుగా, విలువ రూ.15.39 కోట్ల నుంచి రూ.16.18 కోట్లకు పైగా ఉంటుందని వేర్వేరు పేర్కొన్నారు. పట్టుబడిన బంగారానికి సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో జీఎస్టీ, కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ బంగారాన్ని గోరఖ్‌పూర్ నుంచి ఢిల్లీలోని దర్యాగంజ్‌కు తరలిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. నేపాల్ మీదుగా భారత్‌లోకి బంగారం వచ్చిందా ? అన్న కోణంలోనూ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్.. 1 కిలో బరువున్న 26 బంగారు బిస్కెట్లు పట్టుబడితే కేవలం 10 కిలోల బంగారాన్నే చూపించారని ఆరోపించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

 

Latest News