Road accident | ఘోరం.. అదుపుతప్పి వంతెన పైనుంచి పడ్డ బస్సు.. ఐదుగురు దుర్మరణం..

Road accident | ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్‌పై అదుపుతప్పిన ఓ బస్సు రెయిలింగ్‌ను ఢీకొట్టి అమాంతం కిందపడిపోయింది.​ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒడిశాలోని జాజ్‌పూర్‌లో గత రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు పశ్చిమబెంగాల్‌లోని హాల్దియా నుంచి ఒడిశాలోని పూరీకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Road accident | ఘోరం.. అదుపుతప్పి వంతెన పైనుంచి పడ్డ బస్సు.. ఐదుగురు దుర్మరణం..

Road accident : ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెనపై అదుపుతప్పిన ఓ బస్సు రెయిలింగ్‌ను ఢీకొట్టి అమాంతం కిందపడిపోయింది.​ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒడిశాలోని జాజ్‌పూర్‌లో గత రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు పశ్చిమబెంగాల్‌లోని హాల్దియా నుంచి ఒడిశాలోని పూరీకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. NH ​16 పై ఉన్న బారాబతి బ్రిడ్జ్ పైనుంచి బస్సు కిందపడింది.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంవల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మరణించిన ఐదుగురిలో ఒక మహిళ ఉందని చెప్పారు.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.