• Telugu News
  • /National

Road accident | ఘోర ప్రమాదం.. కారును ఢీకొట్టిన లారీ.. ఐదుగురు దుర్మరణం

Road accident | అర్ధరాత్రి వేళ కారును లారీ ఢీకొట్టడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కేరళ రాష్ట్రం కన్నూర్‌ జిల్లాలోని పున్నచ్చేరిలో సోమవారం అర్ధరాత్రి (తెల్లవారితే మంగళవారం) ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లారీ డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి.

Reported by: Thyagi | జాతీయం | Apr 30, 2024, 10:36 am IST
Read Time: 3 mins
Road accident | ఘోర ప్రమాదం.. కారును ఢీకొట్టిన లారీ.. ఐదుగురు దుర్మరణం

Road accident : అర్ధరాత్రి వేళ కారును లారీ ఢీకొట్టడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కేరళ రాష్ట్రం కన్నూర్‌ జిల్లాలోని పున్నచ్చేరిలో సోమవారం అర్ధరాత్రి (తెల్లవారితే మంగళవారం) ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లారీ డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. కారులో మృతదేహాలు నుజ్జునుజ్జు అయిపోయాయి. డెడ్‌బాడీలను పోలీసులు బయటకు తీసి పోస్టుమార్టానికి పంపించారు. గాయపడిన లారీ డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మృతులు కలిచనడుక్కంకు చెందిన పద్మకుమార్ (59), సుధాకరన్ (52), అజిత (35), కృష్ణన్ (65), ఆకాష్‌ (16)గా గుర్తించారు. పద్మకుమార్ కారు నడుపుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దవాళ్లు నలుగురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా బాలుగు ఆకాష్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. లారీ కారుపైకి దూసుకురావడంతో లారీ కింద కారు ఇరుక్కుపోయింది. అతి కష్టం మీద ఫైర్ సిబ్బంది, పోలీసులు కారును బయటికి తీశారు.